-
హీరోతో ఆ పని చేయాలంటూ నిర్మాత బలవంతం చేశాడు: నటి
హాలీవుడ్ నటి న షరాన్ స్టోన్ గుర్తుందా? అదేనండి 90లలో వచ్చిన 'బేసిక్ ఇన్స్టింక్ట్'సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత 1993లో వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘స్లీవర్’తో యువత కలల రాణిగా మారిపోయింది. ఆ సినిమాలోని శృంగార సన్నివేశాలు అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్ చేశాయి. ఆ తర్వాత వరుస సినిమాలతో హాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు హాలీవుడ్లో ప్రకంపనలు పుట్టించాయి. ముఖ్యంగా ఓ నిర్మాత తనను వేధించాడంటూ ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే ఆ నిర్మాత ఎవరనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. చాలా రోజుల తర్వాత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ నిర్మాత ఎవరో బహిర్గతం చేసింది ఈ ఓల్డ్ బ్యూటీ. ‘స్లీవర్’మూవీ షూటింగ్ సమయంలో హీరో బిల్లీ బాల్డ్విన్తో శృంగారంలో పాల్గొనాలని నిర్మాత రాబర్డ్ ఈవెన్స్(2019తో ఈయన మరణించాడు) బలవంతం పెట్టినట్లు గుర్తు చేసింది. ‘ఓ రోజు నిర్మాత రాబర్డ్ తన ఆఫీస్‌కు రమ్మని కబురు పంపారు. నేను అక్కడికి వెళ్లగా.. సినిమా గురించి మాట్లాడుతూ బిల్లీ బాల్డ్విన్తో చనువుగా ఉంటే ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని చెప్పారు. అతనితో నిజంగానే శృంగారంలో పాల్గొంటే.. ఆ సన్నివేశాలను తెరపై చక్కగా పండుతాయని ప్రలోభ పెట్టాడు. కానీ నేను ఆ పని చేయలేనని చెప్పేశాను’ అని నటి షరాన్ స్టోన్ చెప్పుకొచ్చింది. షరాన్ స్టోన్ చేసిన ఆరోపణలపై నటుడు బిల్లీ బాల్డ్విన్ ఎక్స్(ట్విటర్)వేదికగా కౌంటర్ ఇచ్చాడు. ‘సినిమా రిలీజైన ఇన్నేళ్లకు షారన్ స్టోన్ నా గురించి ఎందుకు మాట్లాడుతుందో చెప్పండి? ఆమెకు ఇప్పటికీ నాపై క్రష్ఉందా? లేదా ఆమె ఇచ్చిన చనువును అడ్వాన్స్‌గా తీసుకోకపోవడంతో ఇనేళ్లుగా బాధపడుతూనే ఉందా? నేను కూడా ఒక బుక్ రాసి..అందులో ఆమె గురించి అసత్యాలను, అసభ్యకరమైన విషయాలను చెప్పాలా ఏంటి? అంటూ షరాన్ చేసిన ఆరోపణలు అన్ని అబద్దాలనే పరోక్షంగా చెప్పాడు. Not sure why Sharon Stone keep talking about me all these years later? Does she still have a crush on me or is she still hurt after all these years because I shunned her advances? Did she say to her gal pal Janice Dickinson the day after I screen tested and ran into them on our… pic.twitter.com/PtgqMC6Sgz — Billy Baldwin (@BillyBaldwin) March 12, 2024 -
శృంగార సన్నివేశాల్లో నటించినందుకు కొడుకు దూరమయ్యాడు: నటి
తాను చేసిన ఓ సినిమా వల్ల కొడుకు దూరమయ్యాడంటూ విచారం వ్యక్తం చేసింది హాలీవుడ్ నటి షరాన్ స్టోన్. 1992లో వచ్చిన బేసిక్ ఇన్స్టింక్ట్ సినిమాలో కొద్ది క్షణాల పాటు ఒంటి మీద దుస్తులు లేకుండా నటించింది షరాన్. దీనివల్ల ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ ఒక్క సన్నివేశం వల్ల తన కొడుకు తనకు కాకుండా పోయాడంటోంది. 'టేబుల్ ఫర్ టూ విత్ బ్రూస్ బాజీ' పాడ్‌క్యాస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది నటి. '2000వ సంవత్సరంలో ఓ పిల్లవాడిని నేను దత్తత తీసుకున్నాను. 2004లో నా భర్త ఫిల్ బ్రాన్స్టేన్తో విడిపోయేటప్పుడు పిల్లాడు నాకు కావాలన్నాను. అప్పుడు ఓ న్యాయవాది నా గారాల బాబు దగ్గరకు వెళ్లి ఏమన్నాడో తెలుసా? మీ అమ్మ శృంగార చిత్రాల్లో నటిస్తుంది. నీకు ఆ విషయం తెలుసా? అని అడిగాడు. పదహారు సెకండ్ల వీడియోతో నా క్యారెక్టర్‌నే తప్పు పట్టారు. అలా నా దగ్గర పెరగాల్సిన నా కొడుకు నాకు కాకుండా పోయాడు. ఇది నన్ను మానసికంగా కుంగదీసింది. నా గుండె పగిలినంత పనైంది. ఈ వేదనతో నిజంగానే గుండె సమస్యలతో ఆస్పత్రిపాలయ్యాను. అసలు ఆ సన్నివేశం డైరెక్టర్ నన్ను సంప్రదించకుండా నేరుగా సినిమాలో పెట్టేశాడు. అయినా టీవీలో ఒంటి మీద దుస్తులు లేకుండా చాలామంది కనిపిస్తున్నారు. కానీ వాళ్లను ఎవరూ ఏమీ అనరు. సినిమాలో కాసేపు ఒంటి మీద బట్టల్లేకుండా కనిపించినందుకు నాకు పిల్లాడినే దూరం చేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో నా పేరు పిలవగానే చాలామంది నవ్వుకున్నారు. అది చూసి ఎంతో బాధేసింది. ఎంతో అవమానకరంగా అనిపించింది. కానీ అలాంటి సన్నివేశంలో నటించాలంటే ఎంతో ధైర్యం కావాలి తెలుసా?' అని చెప్పుకొచ్చింది నటి. -
9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్..
Actress Sharon Stone Reveals She Lost 9 Childrens By Miscarriage: సాధారణ మహిళల నుంచి సెలబ్రిటీల వరకు 'అమ్మ' అని పిలుచుకోవాలని తహతహలాడతారు. పిల్లల కోసం ఎంతో ప్రయత్నిస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించక అమ్మ అనే మాధుర్యాన్ని పొందలేని మహిళల బాధ వర్ణణాతీతం. మరి అలాంటిది గర్భస్రావం వల్ల ఏకంగా తొమ్మిది సార్లు పిల్లలను కోల్పోతే. ఇక వారి ఆవేదన గురించి ఎంత చెప్పిన తక్కువే. అలాంటి బాధను అనుభవించింది 64 ఏళ్ల ఒకప్పటి స్టార్ హీరోయిన్ షరాన్ స్టోన్. ఈ అమెరికన్ నటి షరాన్ స్టోన్ 'బేసిక్ ఇన్స్టింక్ట్' సినిమా సిరీస్ ద్వారా అత్యధిక పాపులారిటీని సంపాదించుకుంది. తాజాగా తాను 9 మంది పిల్లలను కోల్పోవడం గురించి తెలిపింది. 'నేను గర్భస్రావం వల్ల తొమ్మిది మంది పిల్లలను కోల్పోయాను. ఇదేం చిన్న విషయం కాదు. శారీరకంగా, మానసికంగా నేను అనుభవించాను. మహిళలుగా మాకు ఈ నష్టం గురించి మాట్లాడేందుకు పదాలు లేవు. ఒకరకమైన ఓటమి భావనతో ఒంటరిగా, రహస్యంగా భరించాల్సిన విషయం. కానీ దీనికి బదులు కాస్తా సానుభూతి, ప్రేమ, కనికరం అవసరం.' అని తెలిపింది. (చదవండి: నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్) షరాన్ స్టోన్ తన మొదటి గర్భస్రావం గురించి 'అలా జరిగినందుకు నేను ఎంతో సిగ్గుపడ్డాను. ఎంతో అవమానకరంగా అనిపించింది. దాని గురించి ఎలా చెప్పాలో నా నోటి నుంచి మాటలు కూడా రావట్లేదు. నిజానికి నా ఆరోగ్యం పట్ల గర్వంగా ఉంటాను. ఎందుకంటే నేను ప్రతిరోజూ వ్యాయామం చేస్తాను. కానీ నాకు తెలిసినంత వరకు పునురుత్పత్తి కోసం అది అంతగా సహాయపడలేదనుకుంటా.' అని పేర్కొంది. (చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ?) -
రొమాంటిక్ రికార్డ్!
ఎప్పుడొచ్చామన్నది కాదు.. ‘బుల్లెట్’ దిగిందా లేదా అన్నదే పాయింట్! ఇరవై రెండేళ్ల కిందట రిలీజైన ‘బేసిక్ ఇన్స్టెంట్’ పిక్చరూ అంతే! అప్పుడెప్పుడో వచ్చిందన్నది కాదు... దాన్ని తలదన్నే ‘రొమాన్స్’ఇంకే సినిమాలోనన్నా పండిందా లేదా అన్నదే టాపిక్. అలనాటి ‘కలల’ రాణి షెరాన్స్టోన్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీ తాజాగా ఓ సరికొత్త క్రెడిట్ దక్కించుకుంది. శృంగారభరిత చిత్రాల్లో ఆల్‌టైమ్ బెస్ట్‌గా రికార్డులకెక్కింది. దీనికి ముందు... తరువాత.. కుప్పలుతెప్పలుగా రొమాంటిక్ చిత్రాలు వచ్చినా... అవేవీ షెరాన్స్టోన్ మెస్మరిజాన్ని జయించలేకపోయాయి. డైలీస్టార్ నిర్వహించిన పోల్‌లో ‘పరిమితి లేని’ షెరాన్ నటనా విన్యాసానికి ఓటర్లు దాసోహం అన్నారు. ‘9 1/2 వీక్స్’ చిత్రం రెండో స్థానంలో నిలిచింది. -
నేను డేటింగ్‌కి రెడీ!
ప్రేమించడానికే కాదు, డేటింగ్ చేయడానికి కూడా వయసుతో పనిలేదంటున్నారు షరాన్ స్టోన్. ఈ హాలీవుడ్ హాట్ లేడీ వయసు ఇప్పుడు 56 ఏళ్లు. మంచి వయసులో ఉన్నప్పుడు ఎంత హాట్‌గా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు షరాన్. అందుకేనేమో డేటింగ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘నేను డేటింగ్ చేయడానికి రెడీ’ అని బాహాటంగా ప్రకటించి, చాలామందికి స్వీట్ షాకిచ్చారామె. చక్కగా ఇంటిపట్టున ఉండి పిల్లలతో కాలక్షేపం చేసుకోకుండా, ఇలాంటి పనులేంటి? అని కొంతమంది అంటున్నారు. కానీ, డేటింగ్ చేయడానికి ఈ వయసే కరెక్ట్ అంటున్నారు షరాన్. ‘‘ఇప్పుడు నా పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్ల బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించుకోగలరు. అందుకని, నేను రిలీఫ్ అయ్యాను. పిల్లలకు చిన్నప్పుడు నా అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నా ఎంజాయ్మెంట్స్ని పక్కనపెట్టా. ఇప్పుడా అవసరం లేదు. అందుకే, నచ్చిన వ్యక్తితో డేటింగ్ చేయాలనుకుంటున్నా’’ అని అసలు విషయాన్ని చెప్పారు షరాన్. ఈవిడగారు ఇలా ప్రకటించగానే.. ఎలాగైనా షరాన్ మనసు గెల్చుకోవాలని హాలీవుడ్లో చాలామంది ఆరాటపడుతున్నారట.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
‘‘కేజ్రీవాల్‌ను చంపుతారా..?’’
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
Advertisement