-
కమల హ్యారీస్ హత్య కుట్ర భగ్నం: రూ.40 లక్షలకు ఒప్పందం
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ హత్యకు కుట్ర పన్నింది ఓ మహిళ. అయితే చివరకు ఆమె కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆమెను జైలుకు పంపించారు. ఈ వార్త అమెరికాలో కలకలం రేపింది. అయితే కమలా హత్యకు ఆమె ఏకంగా దాదాపు అరకోటి వరకు సుపారీ తీసుకుంది. కమలా హత్యకు కుట్రకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. నిందితురాలిని మియామి ఫెడరల్ కోర్టులో హాజరుపరచగా పలు విస్తుగొల్పే విషయాలు వెల్లడయ్యాయి. చదవండి: కొత్త ట్విస్ట్.. ‘ఆ బిడ్డ నాకు పుట్టలేదు! డీఎన్ఏ టెస్ట్ చేయండి’ దక్షిణ ఫ్లోరిడాకు చెందిన మహిళ నివియన్ పెటిట్ ఫెల్ప్స్ (39) ఫిబ్రవరిలో కమల హత్యకు కుట్ర పన్నింది. 53 వేల డాలర్ల (సుమారు రూ.39 లక్షలు)కు కమలను హత్య చేసేందుకు ఆమె ఒకరితో ఒప్పందం కుదుర్చుకుంది. 50 రోజుల్లోనే ఆమెను హత్య చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే ఆ విషయాలను మాట్లాడుతూ వీడియో తీసుకుంది. అయితే ఆ వీడియోను ఇతరులకు పంపడం ఆమె చేసిన పెద్ద తప్పిదం. దీంతో ఆమె కుట్ర నిఘా వర్గాలకు తెలిసిపోయింది. నిఘా వర్గాలు ఆ వీడియోను పరిశీలించిన అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మియామీ న్యాయస్థానంలో నిందితురాలిని హాజరుపరిచారు. కమల హ్యారీస్‌ను హత్య చేస్తానని ఆరుసార్లు హెచ్చరికలు పంపింది. కమల హత్యకు ఆమె తుపాకీ లైసెన్స్ అనుమతికి దరఖాస్తు చేసుకున్నది కూడా. ఈ కేసులో విచారణ అనంతరం నివియన్కు ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. చదవండి: బెడ్రూమ్లోకి వెళ్తే వద్దంటుండు: భర్తపై భార్య ఫిర్యాదు హత్యకు కుట్ర పన్నిన మహిళ నివియన్ పెటిట్ ఫెల్ప్స్ -
అడ్డంగా పట్టుబడ్డ పోలీసు అధికారి!
ఫ్లోరిడా: వేశ్యలోలుడైన ఓ పోలీసు ఉన్నతాధికారి స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయాడు. వేశ్యగా భావిస్తూ ఓ మహిళకు 20 డాలర్లు ఇచ్చి.. ఓరల్ సెక్స్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె అండర్ కవర్లో ఉన్న మహిళా పోలీసు కావడంతో ఆ అధికారి బండారం బయటపడింది. ఈ వ్యవహారంలో అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడా పోలీసు అధికారి వింటైర్ ఫిన్నీపై గతవారం వేటుపడింది. పోలీసు అధికారి అయినప్పటికీ వృత్తి ధర్మానికి కట్టుబడకుండా అసాంఘిక చర్యలకు పాల్పడినందుకు ఆయనను ఉద్యోగంలో నుంచి తొలగించినట్టు బోయన్టన్ బీచ్ పోలీసు మహిళా అధికారి ప్రతినిధి స్టెఫానీ స్లాటర్ ఓ ప్రకటనలో తెలిపారు. సీనియర్ పోలీసు అధికారి అయిన ఫిన్నీ గత అక్టోబర్ నుంచి పెయిడ్ అడ్మినిస్ట్రేటివ్ సెలవులో ఉన్నాడు. అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు ఈ అండర్ కవర్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. అండర్ కవర్లో ఉన్న మహిళా పోలీసుతో అతడి వ్యవహారానికి సంబంధించిన వీడియోను పోలీసుశాఖ విడుదల చేసింది. అయితే, తన క్లయింట్ అమాయకుడని, ఈ స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో అతనిపై నేరపూర్వక అభియోగాలు మోపరాదని ఫిన్నీ లాయర్ జాన్ హోవె తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యాదాద్రీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
ఉరివేసుకొని యువకుడి బలవన్మరణం
తెలంగాణను పాలించే హక్కు కాంగ్రెస్‌కే ఉంది
ద్వంద్వ పౌరసత్వం కల్పించేందుకు కృషి
అరచేతిలో ఎన్నికల సమాచారం
ఈవీఎంల కమిషనింగ్ పరిశీలన
సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్‌పై రాయితో దాడి
టీ20 ప్రపంచకప్‌కు ఉగ్ర ముప్పు
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
తప్పక చదవండి
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement