-
గ్లామర్ అంటే స్కిన్ షో కాదు : నివేదా థామస్
నివేదా థామస్.. గ్లామర్ కన్నా అభినయతారగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు తెలుగులో చేసిన సినిమాలు కొన్నే అయినా.. ఇక్కడ సంపాదించుకున్న అభిమానం మాత్రం ఘనమే. అందం కన్నా అభినయం మీద ఆమెకున్న శ్రద్ధ అలాంటిది. తనలోని గ్లామర్‌ను ఆమె అశ్రద్ధ చేసినా ఈ బ్రాండ్స్ మాత్రం తీర్చిదిద్దుతున్నాయి.. సొబారికో దర్జా, విలాసం, సౌకర్యం .. ఈ మూడింటినీ ఒకేసారి ఆస్వాదించాలంటే సొబారికో బ్రాండ్‌ను ఎంచుకోవాలి. దేశంలోని ఏ మూలలో ఏ చేనేత ప్రత్యేకత ఉన్నా.. ఏ కళాకారుడి.. ఏ కళాకారిణి చేతిలో సృజన ఉన్నా అది ఈ బ్రాండ్‌లో ప్రతిబింబిస్తుంది. అందుకే సొబారికో అవుట్ ఫిట్స్‌ను ఇష్టపడని వాళ్లు లేరు సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా. ఈ అభిమానాన్నే బ్రాండ్ వాల్యూగా స్థిరపరచుకుంది. దాన్నే వారసత్వంగానూ మలచుకుంది ఏళ్లుగా. ఫ్యాబ్రిక్, డిజైన్‌ను బట్టి ధరలు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. డ్రెస్ బ్రాండ్ : సొబారికో అనార్కలీ సెట్ ధర: 37,500 జ్యూయెలరీ బ్రాండ్: అమెథిస్ట్ అండ్ ఆమ్రపాలి ధర: డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. అమెథిస్ట్ ఇది కిరణ్ రావు మానస పుత్రిక. అమూల్యమైన కళాఖండాల నిలయం.. ఈ బ్రాండ్. 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. దుస్తులు, జ్యూయెలరీ, ఫుట్ వేర్ నుంచి ఇంటి అలంకరణ వస్తువులు.. కాఫీ షాప్ వరకు అన్నిటికీ ఈ అమెథిస్ట్ కేరాఫ్. ఈ బ్రాండ్ రిచ్‌నెస్‌కు తగ్గట్టే ధరలు ఉంటాయి. ఆమ్రపాలి నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో కూడా ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. -
చిన్న చిన్న ఆనందాలను ఎక్కువగా ఇష్టపడుతుంటా... అదే నా బ్యూటీ సీక్రేట్: కృతి శెట్టి
తొలి సినిమాతోనే అదృష్టం ఆమెను ‘ఉప్పెన’లా ముంచెత్తింది. ఎస్.. ఇక్కడ కృతి శెట్టి ఫాలో అయ్యే ఫ్యాషన్ బ్రాండ్స్ గురించే తెలుసుకోబోతున్నాం. దృష్టి సారించండి... పెర్నియా పాప్ అప్ షాప్ అందమైన డిజైన్స్ అందించే ఫ్యాషన్ డిజైనర్స్‌కు, వాటిని ధరించి ఆనందించే ఫ్యాషన్ ప్రియులకు మధ్య వారధి ఈ ‘పెర్నియాస్ పాప్ అప్ షాప్’. ఇదొక ఆన్లైన్ స్టోర్. చిన్న నుంచి పెద్ద వరకు ఎందరో డిజైనర్ల డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. ప్రత్యేకంగా డిజైన్ చేయించుకునే అవకాశమూ ఉంది. ధరను నిర్ణయించేదీ డిజైనరే. వైవిధ్యమైన డిజైన్స్‌ను మాత్రమే అందుబాటులో ఉంచుతుందీ స్టోర్. ఇందుకు వివిధ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. అదే దీని బ్రాండ్ వాల్యూ. ప్రత్యక్షంగా కొనుగోలు చేసే అవకాశం లేదు. ఆన్లైన్లోనే కొనుగోలు చేయాలి. జ్యూయెలరీ బ్రాండ్: పెర్నియాస్ పాప్ అప్ షాప్ ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. చదవండి: అచ్చం భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..! సురభి షా.. పెళ్లిరోజున భర్త ఇచ్చే బహుమతి భార్యకు ప్రత్యేకమే. సురభికి మాత్రం ఆ బహుమతి ప్రత్యేకం కాదు, తనలోని ప్రతిభను పదిమందికి చూపించే ఓ అద్భుతమైన అవకాశం. ఫ్యాషన్‌పై ఉన్న పట్టు, ఆసక్తి, తన దుస్తులను తానే డిజైన్ చేసుకునే తీరుకు మెచ్చిన ఆమె భర్త 2006లో ‘సురభి షా’ పేరుతో ఓ బొటిక్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఆ కానుకనే టాప్ మోస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఒకటిగా నిలిపింది సురభి. ఎటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయకపోయినా, తన సృజనాత్మక ఆలోచనలతో ఆకట్టుకునే డిజైన్స్‌ను రూపొందిస్తూ అనతికాలంలోనే ఫేమస్ డిజైనర్‌గా ఎదిగింది. ఆ కళాత్మకత సెలబ్రిటీలను సైతం మెప్పించింది. ఈ డిజైన్స్ సరసమైన ధరల్లోనే లభిస్తాయి. సురభి షా మెయిన్బ్రాంచ్ జైపూర్‌లో ఉంది. ఆన్‌లైన్‌లోనూ ఆమె డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. డ్రెస్ డిజైనర్ : సురభి షా ధర: రూ. 36,000 - దీపిక కొండి చదవండి: World's Rarest Dog Breed: ఇది జిరాఫీ కాదు!! కుక్క.. అత్యంత అరుదైన బ్రీడ్!! కానీ కారు ప్రమాదంలో.. -
సెట్ కాదన్న డ్రెస్సే కొంటా..! నా ఫేవరేట్ బ్రాండ్ ఇదే..: హెబ్బా పటేల్
‘నా పేరు కుమారి.. నా ఏజ్ 21..’ డైలాగ్ ఎవరిదో గుర్తుంది కదా.. ఎస్.. హెబ్బా పటేల్. ఆమెకు సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ అంతే క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఆ అందానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్.. జ్యూయెలరీని అందిస్తున్న బ్రాండ్స్ ఇవే.. నచ్చితే వెంటనే కొనేస్తా. నాలాగే బొద్దుగా ఉన్నవాళ్లకి కొన్ని దుస్తులు నప్పవని అంటుంటారు. అందులో నిజం లేదు. శరీరానికి కష్టం కలిగించకుండా.. ఇష్టంతో ధరించే ఏ దుస్తుల్లో అయినా అందంగానే కనిపిస్తాం – హెబ్బా పటేల్ ఇస్సా స్టూడియో... ఇటీవలే ప్రారంభమై, బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఫ్యాషన్ హౌస్‌లలో ఒకటి ఇస్సా స్టూడియో. హైదరాబాద్‌కు చెందిన స్వాతి, చేతన అనే ఇద్దరు స్నేహితులు కలసి స్థాపించిన ఈ సంస్థ, ఆరంభంలోనే అందమైన డిజైన్స్‌తో పలువురు సెలబ్రిటీలను ఆకర్షించింది. నిహారిక కొణిదెల, అనసూయ భరద్వాజ్, మంచు లక్ష్మి తదితరులు వీరి కలెక్షన్స్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారు. యువతరమే వీరి టార్గెట్. యూత్ స్టైల్‌ను మ్యాచ్ చేస్తూ డిజైన్ చేసే సంప్రదాయ దుస్తులతో ఫేమస్ బ్రాండ్‌గా ఇస్సాను నిలిపారు. ప్రస్తుతం భారత్‌తో పాటు, అమెరికా నుంచి కూడా ఆర్డర్లను తీసుకుంటున్నారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ ఇస్సా స్టూడియో డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. ఆ డ్రెస్ నీకు సెట్ కాదని ఎంతమంది చెప్పినా వినను. చీర..బ్రాండ్: ఇస్సా స్టూడియో ధర: రూ. 34,000 ఆర్నీ బై శ్రావణి.. ఈ బ్రాండ్ పెళ్లి ఆభరణాలకు ఫేమస్. ఈ నగలను ధరించి పెళ్లి పందిట్లోకి వెళ్లాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. రెడీమేడే కాదు స్వయంగా ఆర్డర్ ఇచ్చి కూడా కావలసిన నగలను డిజైన్ చేయించుకోవచ్చు. విలువైన రత్నాలు, వజ్రాలతో తయారయ్యే ఈ డిజైన్స్‌కు మంచి గిరాకీ ఉంది. పలువురు సెలబ్రిటీల ఫేవరెట్ అనీ ఈ బ్రాండ్‌కి పేరుంది. డిజైన్‌ను బట్టే ధర. కొన్ని సందర్భాల్లో రత్నాల విలువ, ఆభరణాల నాణ్యతపైనా ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్‌గా ఉన్న ఆర్నీ బై శ్రావణి జ్యూయెలరీని ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: ఆర్నీ బై శ్రావణి ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. -దీపిక కొండి చదవండి: Scientifically Proven Facts: నవ్వితే ఇన్ని ఉపయోగాలా? విస్తుపోయే వాస్తవాలు.. -
నా ఫ్యాషన్ సీక్రేట్ అదే.. షాపింగ్‌పై చాలా కంట్రోల్‌గా ఉంటా..: త్రిష
ఆచి తూచి అడుగులు వేయకుంటే.. బోల్తా కొట్టడం ఎవరికైనా తప్పదు. కెరీర్లో అలాంటి జాగ్రత్తలు పాటించింది కాబట్టే.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతోంది త్రిష. ఆ ప్రేక్షకాదరణకు ఆమె అభినయంతో పాటు అందమూ ఓ కారణమే. ఆ అందానికి అద్దం పడుతున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే.. సబ్యసాచి.. పేరుకే ఇండియన్ బ్రాండ్ కానీ, ఇంటర్నేషనల్ బ్రాండ్ కంటే గొప్పది, ఖరీదైనది. దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు అన్నీ సబ్యసాచి కలెక్షన్స్‌తోనే జరుగుతాయి. వాటిల్లో విరాట్ కొహ్లీ, అనుష్కశర్మల పెళ్లి బట్టలు ఫేమస్. కనీసం ఒక్కసారైనా సబ్యసాచి డిజైన్ వేర్ ధరించాలని, సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఏంతోమంది ఆశపడుతుంటారు. ఆ బ్రాండ్‌కున్న వాల్యూ అలాంటిది. ఈ మధ్యనే మధ్యతరగతి మహిళల కోసం రూ. పదివేల చీరను డిజైన్ చేశారు. ఇదే ఈ బ్రాండ్ చీపెస్ట్ చీర. సుమారు లక్ష చీరలను సిద్ధం చేస్తే, రెండు రోజుల్లోనే మొత్తం కొనుగోలు చేశారు. పదివేల చీరైనా, పదినిమిషాల్లో అమ్ముడైపోతుంది. ఇదంతా సబ్యసాచి ముఖర్జీ డిజైన్ మహత్యం. బెంగాలీ కుటుంబ నేపధ్యం నుండి వచ్చిన సబ్యసాచి కెరీర్ ఆరంభించిన అనతి కాలంలోనే ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగాడు. 1999లో తన పేరునే ఓ బ్రాండ్ హౌస్‌గా మార్చి, మరింత పాపులర్ అయ్యాడు. అందమైన ఆభరణాలు కూడా ‘సబ్యసాచి’ స్టోర్స్‌లో లభిస్తాయి. ఇండియాలోని ప్రముఖ నగరాలతోపాటు అమెరికా, లండన్‌లోనూ స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ సబ్యసాచి డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. చీర బ్రాండ్: సబ్యసాచి ధర: రూ. 1,79,500 మంజుల జ్యూయెల్స్... ఒక సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ బయట పడుతుందంటారు. ఈ మాట మంజుల విషయంలో అక్షరాల నిజం. కుటుంబం గడవటం కోసం భర్తతో కలసి మైనింగ్ పరిశ్రమలో పనిచేసి, బంగారంతోపాటు తనలోని ప్రతిభను కూడా వెలికి తీసింది మంజుల. అప్పటివరకూ బంగారం అంటే ఇష్టం మ్రాతమే. ఆ ఇష్టాన్ని ఆసక్తిగానూ.. ఆ తర్వాత ఉపాధి అవకాశంగానూ మార్చుకుంది. జెమాలజీలో పీజీ చేసి, ఆభరణాల రూపకల్పన నేర్చుకుంది. మొదట బంధువులు, తెలిసిన వారి వివాహాది శుభకార్యాలకు డిజైన్ చేసింది. వాటికి మంచి పేరు రావడంతో 2010లో ‘మంజుల జ్యూయెల్స్’ సంస్థ స్థాపించింది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు, చాలామంది సెలబ్రిటీలకు కూడా మంజుల తన డిజైన్స్‌ను అందిస్తోంది. ధర ఆభరణాల నాణ్యత, డిజైన్ ఆధారంగా ఉంటుంది. హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్‌గా ఉన్న మంజుల జ్యూయెల్స్ను ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: మంజుల జ్యూయెల్స్ ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. - దీపిక కొండి చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!! -
చీర కట్టులో మెరిసిపోతున్న అను ఇమాన్యుయేల్.. ధరెంతో తెలుసా!
‘కళ్లు మూసి తెరిచేలోపే, గుండెలోకే చేరావే..’ అంటూ అభిమానుల మనసు దోచుకొని మజ్నూలుగా మార్చేసిన నటి.. అమెరికా అమ్మాయి.. అను ఇమాన్యుయేల్. ఆమె మదిలో స్థానం సంపాదించుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. మెరో జ్యూయెలరీ రాజస్థాన్‌లో ‘మెరో’ అంటే ‘గని’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఇదొక ఆభరణాల ఖని. అంతరించిపోతున్న గిరిజన, సంప్రదాయ ఆభరణాల డిజైన్స్‌ను శోధించి, సాధిస్తుంది ఈ బ్రాండ్. ఎక్కువగా హస్తకళ, శిల్పకళల సంప్రదాయ వారసత్వం నుంచి ప్రేరణ పొందిన డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. బంగారు ఆభరణాలు కూడా దొరుకుతాయి. కానీ, వెండితో తయారు చేసిన వాటికే గిరాకీ ఎక్కువ. ఆభరణాల నాణ్యతతో సంబంధం ఉండదు. డిజైన్‌ను బట్టే ధర ఉంటుంది. ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లో ఈ బ్రాండ్‌కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ మెరో జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: మెరో జ్యూయెలరీ ధర: రూ. 8,000 సాక్షం అండ్ నీహారిక సాక్షం, నీహారిక బిజినెస్ పార్ట్‌నర్సే కాదు.. మంచి స్నేహితులు కూడా. ఫ్యాషన్‌పై వారికి ఉన్న అభిరుచులు, ఆలోచనలు ఒక్కటే కావడంతో కలసి కెరీర్‌ను స్టార్ట్ చేశారు. న్యూఢిల్లీలోని ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి, 2017లో ఇద్దరి పేరుతో ఓ ఫ్యాషన్ హౌస్ ప్రారంభించారు. ఎక్కువగా చేనేత కళాకారులు నేసిన ఫ్యాబ్రిక్‌నే ఉపయోగిస్తారు. సూరత్, జైపూర్ కళాకారులతో కుట్లు, అల్లికలు, రంగు అద్దకాల డిజైన్స్ వేయిస్తుంటారు. ఇక సున్నితమైన సంప్రదాయ డిజైన్స్‌లో వీరికి పెట్టింది పేరు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంటుంది. చీర బ్రాండ్: సాక్షం అండ్ నీహారిక ధర: రూ. 36,990 - దీపిక కొండి చదవండి: ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్‌తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్‌పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement