-
జయహో బాపూ
చిత్రం: శంకర్‌దాదా జిందాబాద్ రచన: సుద్దాల అశోక్ తేజ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: దేవిశ్రీ ప్రసాద్, సాగర్ జెమినీ కిరణ్‌గారు నన్ను పిలిపించి ‘శంకర్‌దాదా జిందాబాద్’లో గాంధీ పైన పాట రాయమన్నారు. సరేనని చెప్పి ఇంటికి వచ్చి, నా ఆఫీసులో కూర్చుని గాంధీ గురించి విన్నది, చదివింది గుర్తు చేసుకుంటున్నాను. అనేక తరంగాలు ఆయన జీవన మహాసముద్రంలో లేచి పడుతున్నాయి. గాంధీ మద్రాసు వచ్చినప్పుడు రాజాజీ ఒక ప్రఖ్యాత సాముద్రికవేత్తకు గాంధీ చేయి చూపించి భవిష్యత్తు తెలుసుకుందామని చెబితే, గాంధీ సున్నితంగా తిరస్కరించి, ‘మై క్యారెక్టర్ ఈజ్ మై ఫేట్’ అన్నాడట.ఆయన ఆత్మకథ ఎన్నోసార్లు చదివిన నాకు ఎప్పుడూ గాంధీ పలికిన సహస్రానేక సుభాషితాల్లో పైమాటే నిరంతరం మంత్రంలా మోగుతుంటుంది.ఆయన జీవితాకాశాన్ని ఒక పల్లవి – రెండు చరణాల్లో చెప్పడమంటే కమండలంలో సముద్రాన్ని వడబోయడం కదా అనుకున్నాను. పెన్ను ఎత్తకుండా ఒకే రేఖా చిత్రంలో గాంధీని దించి సినీ నటులు గుమ్మడిగారికి ఇచ్చిన బాపు ‘గాంధీ’ చిత్రం మనసులో మెదలగానే పల్లవి పల్లవించింది.గాంధీ ఎంత నిరాడంబరుడో... పల్లవి అంతే నిరాడంబరంగా మొదలవ్వాలని ‘కళ్లజోడుతో – చేతికర్రతో కదిలిందో సత్యాగ్రహం’ అనే వాక్యం కాగితంపై సాక్షాత్కరించింది. ‘జయహో బాపూ’ అనుకున్నాను. ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే ‘‘వెండి కొండలా శిరసు పండిన యువకుల మించిన సాహసం’’ అనే వాక్యం రాలేదు. నేను రాసిన రెండో వాక్యం... ‘‘అతడంటె గడగడలాడింది ఆంగ్లేయుల సింహాసనం’’.అయితే పాట పూర్తయ్యాక నాకు సంబంధం లేకుండా జరిగిన మార్పు ‘వెండి కొండలా’ వాక్యం రెండో వాక్యమైంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చేసిన మార్పని తెలిసి, ‘ఓహో’ అనుకుని సమన్వయం చెడనందుకు సంతోషించాను. కళ్లజోడు – చేతికర్ర... అంటూ ఆయన వాడిన పరికరాలను పల్లవికి ఆధారంగా తీసుకున్న నేను తరవాత ఆయన ఆకారాన్ని కూడా చరణించుదామనుకుని ‘బక్క పలచని బాపు గుండెలో ఆసేతు హిమాచలం’ అని రాసి వెంటనే అతని ‘ఉక్కు నరాల్లో ఉప్పొంగే రక్తం స్వాతంత్య్ర రక్త గంగాజలం’ అన్నాను. స్వాతంత్రేచ్ఛతో ఉప్పొంగే రక్తం పవిత్ర గంగాజలం అనుకున్నాను. ఆయన పోరాటం సాయుధం కాదు, అహింసాయుధం కనుక ‘‘చాకు – పిస్టల్ – కొడవలి – గొడ్డలి ఎందుకు హింసా సాయుధం’’ గా కొనసాగింది. ‘‘భయం చెందని రక్తం చిందని స్వాతంత్య్రోద్యమ జ్వాలలు/ గాలి తరంగాలై వీచినవి దేశంలో నలుమూలలుగా’’ అని ముగించాను.దేశంలో వర్తమానంలో జరిగే ఘోరాలను ఆపడానికి ‘వందే మాతరం గాంధీ ఓంకారం/ఓ బాపూ నువ్వే రావాలి నీ సాయం మళ్లీ కావాలి/జరిగే దుర్మార్గం ఆపాలి నువ్వే ఓ మార్గం చూపాలి/కళ్ల జోడుతో చేతి కర్రతో కదిలే ఓ సత్యాగ్రహమా’ వాక్యాలు తర్వాత పల్లవిగా తలకెక్కాయి. ముందనుకున్న పల్లవి వాక్యాలు చరణాలు అయ్యాయి. ప్రతి అక్టోబర్ 2న టీవీలలో పాఠశాలల్లో జీవనదులై ప్రవహిస్తున్నాయి. – ఇంటర్వ్యూ: వైజయంతి పురాణపండ -
తెలుగు సినిమాని కొత్త దారిలో తీసుకెళుతుంది
ఎం.ఎస్.క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్’. మాగంటి శ్రీనాథ్, మేఘన జంటగా నటించారు. నాగసాయి మాకం దర్శకుడు. ఈ చిత్రం కోసం గోరేటి వెంకన్న పాడిన ప్రచార గీతాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాగసాయి మాట్లాడుతూ – ‘‘దాదాపు 200 పోలీస్ స్టేషన్లలకు వెళ్లి అక్కడి కేసులను పరిశీలించి కథను తయారు చేసుకున్నాను. సినిమాకి పనికొచ్చే కేసులను కథలో చేర్చాం. ఈ కేసులన్నీ వినోదాత్మకంగానే ఉంటాయి. సినిమా అంతా గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుంది’’ అన్నారు. మహంకాళీ శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘నేనీ చిత్రాన్ని ప్యాషన్ కోసం చేయలేదు. వ్యాపారం కోసమే చేశాను. పెట్టిన డబ్బు తిరిగి రాకపోతే ప్యాషన్ ఉండి ఏం లాభం. ఈ సినిమాను కొత్త తరహా కథ, కథనాలతో తెరకెక్కించాం’’ అన్నారు. సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ – ‘‘సాహిత్యానికి చిన్నా పెద్దా తేడా లేదని దాసరిగారు నాతో చెప్పేవారు. చిన్న హీరోకు పాట రాసినా సూపర్ స్టార్‌కు రాసినట్లే భావించి రాయాలని చెప్పేవారు. అలాగే ఈ చిత్రంలో మంచి పాట రాశాను. మనసు పెట్టి రచించాను’’ అన్నారు. గోరేటి వెంకన్న మాట్లాడుతూ – ‘‘నాకు గాయకునిగా, గీత రచయితగానే కాకుండా నటునిగా ఈ చిత్రంలో అవకాశం కల్పించారు దర్శక,నిర్మాతలు. ప్రాధాన్యమున్న పాత్రలో నటించాను. కావాల్సినంత వినోదం ఉంటుంది. ‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్ ’ తెలుగు సినిమాను కొత్తదారిలో తీసుకెళ్లే చిత్రమవుతుంది’ అన్నారు. -
సుద్దాల, గోరటికి జాలాది పురస్కారం
విశాఖ కల్చరల్: జాలాది రచనలు అద్భుతం, అనితరసాధ్యమని ప్రముఖ సినీరచయిత సుద్దాల అశోక్‌తేజ కొనియాడారు. సుప్రసిద్ధ సినీగేయ రచయిత, రంగస్థల ప్రయోక్త డాక్టర్ జాలాది రాజారావు 86వ జయంతి వేడుక సిరిపురం వుడా చిల్డ్రన్స్ థియేటర్లో బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో సుద్దాల అశోక్‌తేజ, ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్నలకు జాలాది పురస్కారాలను ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, జాలాది ట్రస్ట్ వ్యవస్థాపకురాలు జాలాది విజయ తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా సుద్దాల మాట్లాడుతూ జాలాది, కొసరాజులు సినీజగత్తులో రారాజులని, వారి స్ఫూర్తితోనే 23 సంవత్సరాలుగా రచనలు చేస్తున్నట్లు తెలిపారు. గోరటి వెంకన్న మాట్లాడుతూ జాలాదిని తమిళంలో భైరవమూర్తితో పోల్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement