-
సుప్రీంకోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ బహిర్గతం చేయని ఆరేళ్ల ట్యాక్స్ రిటర్న్ వివరాలను పొందే హక్కు అమెరికా పార్లమెంట్ కమిటీకి ఉందంటూ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. దీంతో ఇన్నాళ్లూ ట్యాక్స్ రిటర్స్లను బయటపెట్టని ట్రంప్‌కు సమస్యలు ఎదురుకానున్నాయి. 2015–2020 కాలానికి సంబంధించి ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం సహా స్థిరచరాస్తుల ట్యాక్స్ రిటర్న్‌ల వివరాలను బహిర్గతంచేయలేదు. ట్రంప్ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నాయంటూ హౌజ్ వేస్ అండ్ మీన్స్ కమిటీ ఆరోపించింది. కమిటీ దూకుడును అడ్డుకునేందుకు ట్రంప్ కింది కోర్టును ఆశ్రయించారు. అక్కడ ట్రంప్‌కు చుక్కెదురైంది. -
ఉద్యోగాలు మారడాన్ని బట్టి పన్ను మినహాయింపు ఉంటుందా?
నేను 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారాను. మొదటి యజమాని దగ్గర 7 నెలలు, రెండో యజమాని దగ్గర 5 నెలలు పని చేశాను. ఇద్దరూ ఫారం 16 జారీ చేశారు. ఇద్దరూ స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు ఇచ్చారు. కానీ రిటర్ను నింపేటప్పుడు ఒక స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే చూపించాలంటున్నారు. ఇది కరెక్టేనా? – ఎ. సూర్యప్రకాశ్, హైదరాబాద్ మీరు అడిగిన ప్రశ్నకి మీ వయస్సుతో సంబంధం లేదు కానీ సాధారణంగా, వయస్సును బట్టి పన్నుభారం మారుతుంది. ఇక మీ సంశయానికి జవాబు ఏమిటంటే, ఒక ఉద్యోగి ఒక సంవత్సర కాలంలో ఎన్న ఉద్యోగాలు చేసినా, మారినా, ఆ ఉద్యోగికి స్టాండర్డ్ డిడక్షన్ ఒక్కసారే .. ఒక మొత్తమే తగ్గించాలి. ఇది ఉద్యోగికి వర్తించే మినహాయింపే తప్ప యజమానులకు సంబంధించినది కాదు. రెండో యజమాని ఫారం 16 జారీ చేసేటప్పుడు, అంతకన్నా ముందు యజమాని ఇచ్చిన ఫారం 16ని చూడాలి. అందులోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మీ విషయంలోనూ ఇలాగే జరిగి ఉంటే రెండో యజమాని ఆ తప్పు చేసేందుకు అవకాశం ఉండేది కాదు. మీకు మొత్తం మీద రూ. 50,000 మాత్రమే మినహాయింపు వస్తుంది. రెండు సార్లు రూ. 50,000 తగ్గింపు ఇవ్వరు. ఒకసారి మాత్రమే చూపించడం, క్లెయిం చేయడం కరెక్టు పని. ఆన్లైన్లో ఫైల్ చేసినప్పుడు ఇటువంటి పొరపాట్లు జరగవు. నా వయస్సు 52 సంవత్సరాలు. నేను టీచర్ని. నా భార్య వయస్సు 49 సంవత్సరాలు. తను కూడా టీచరే. భువనగిరిలో చెరొక స్కూలులో పని చేస్తున్నాం. ఇది మా స్వస్థలం. మా నాన్నగారు (లేరు) కట్టించిన ఇంట్లో కలిసి కాపురం చేస్తున్నాం. అమ్మ మాతో ఉంటోంది. ఇంటద్దె క్లెయిం చేయవచ్చా? మీ ఇద్దరికీ వచ్చే జీతభత్యాల్లో బేసిక్, డీఏ, ఇంటద్దె అలవెన్సు, ఇతరాలు మొదలైనవి ఉంటాయి. నిజంగా మీరు ప్రతినెలా అద్దె చెల్లించినట్లయితే, అలా చెల్లించినందుకు మీ ఆదాయపు లెక్కింపులో అర్హత ఉన్నంత మేరకు మినహాయింపుగా తగ్గిస్తారు. అలా తగ్గించినందు వలన ఆదాయం తగ్గి, పన్ను భారం తగ్గుతుంది. భార్యభర్తలు కలిసి ఒకే గూటి కింద కాపురం.. ఇద్దరూ అద్దె చెల్లించే ఉంటున్నారా? మీరు ఆ ఇంట్లో ఉంటున్నాం అంటున్నారు. అద్దె ఇవ్వడం లేదు. కాబట్టి మీ ఆదాయంలో నుంచి ఇంటద్దె అలవెన్స్‌కి క్లెయిం .. అంటే మినహాయింపు పొందకూడదు. ఇది సబబు కాదు. అయితే, ఒక విధంగా ప్లానింగ్ చేసుకోవచ్చు. మీ నాన్నగారు కట్టించిన ఆ ఇంటికి వారసులెవ్వరు? మీ అమ్మగారు అనుకుందాం. అంటే మీ అమ్మగారు ఇంటి ఓనరు. ఆవిడ ఇంట్లో మీరు అద్దెకు ఉంటున్నట్లు చెప్పవచ్చు. మీ ఇద్దరిలో ఎవరి జీతం ఎక్కువో వారికి ఈ ప్లానింగ్ బాగుంటుంది. ఇద్దరి జీతం ఇంచుమించు సమానంగా ఉంటే ఇద్దరూ కలిసి పంచుకోవచ్చు. అద్దె నెలకు రూ. 10,000 అనుకోండి. చెరి సగం మీ అమ్మగారికి ఇవ్వండి. పూర్తి బెనిఫిట్ రావడానికి తగినంతగా అద్దెను లెక్కించండి. మీ అమ్మగారి పాన్ తీసుకోండి. బ్యాంకు అకౌంటు తెరవండి. ఆ అకౌంటులో తూ.చా. తప్పకుండా ప్రతి నెలా అద్దెలు విడివిడిగా జమ చేయండి. ఇలా చేయడం వల్ల వ్యవహారానికి చట్టరీత్యా బలం ఏర్పడుతుంది. ఓనర్, అద్దె, బ్యాంకు ద్వారా చెల్లింపు, పాన్, ఇలా ఇవన్నీ గట్టి రుజువులే. 60 ఏళ్ల లోపు వారికైతే నెలసరి అద్దె రూ. 20,000 దాటితే తప్ప (మీ అమ్మగారికి ఇతరత్రా ఏ ఆదాయం లేదనుకుందాం), 60 సంవత్సరాలు దాటితే రూ. 25,000 వరకూ ఏ పన్ను భారం ఉండదు. మీరే ఆ ఇంటికి ఓనర్ అయితే ఇలా చేయవద్దు. మీరిద్దరూ మీ మొత్తం ఆదాయంలో ఇంటద్దె అలవెన్స్‌ని మినహాయింపుగా పొందవద్దు. తప్పుగా క్లెయిం చేసి ఎటువంటి కష్టాలు కొని తెచ్చుకోకండి. - కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు చదవండి : రాబడులు, రక్షణ ఒకే పథకంలో.. -
ట్యాక్స్ రిటర్న్ సందేహాలను నివృత్తి చేసుకోండి
రిటర్నులు దాఖలుకు ఈ నెలాఖరుతో గడువు పూర్తవుతుంది. త్వరపడి మీ బాధ్యతలను నిర్వర్తించండి. మనంతట మనమే మన ఆదాయ పరిమితి దాటితే స్వచ్ఛందంగా రిటర్నులు దాఖలు చేయాలి. ఈ విషయంలో అసెసీలకు అవగాహన పెంపొందించే దిశగా డిపార్ట్మెంట్ వారు ఎన్నో చర్యలు చేపట్టారు. పత్రికల్లో, టీవీల్లో ఈ మేరకు రిటర్నులు సకాలంలో వేయండంటూ ప్రకటనలు ఇచ్చారు. అంతేకాకుండా ఒక వెబ్సైట్ నిర్వహిస్తూ..ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. అందులో భాగంగా గతవారం కొన్ని ప్రశ్నలు.. వాటికి సమాధానాలు విడుదల చేశారు. * ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో సమస్త సమాచారం * మీ రిటర్నులు మీరే దాఖలు చేసుకోవచ్చు సాధారణంగా అసెసీలకు సందేహాలుంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ అంటేనే.. ఒకరకమైన భయం. ఎన్నో అపోహలు. ఆపై ఏవేవో ఆలోచనలు. రిటర్నులు ఎలా వేయాలి? ఏ ఫారం తీసుకోవాలి? ఎవరు వేయాలి? ఎక్కడ వేయాలి? గడువు తేదీ? ఇలా ఎన్నో ప్రశ్నలు మన మదిలో మెదులుతూ ఉంటాయి. అలాగే పాన్ ఉంటే వేయాలా? ప్రతి సంవత్సరం వేయాలా? పన్ను కడితే వేయాలా? పన్ను భారం లేకపోతే అవసరం లేదా? ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సైట్లో సమాధానమిచ్చారు. ప్రశ్నలను పూర్తి సమాచారంతో సమగ్రమైన వివరాలతో చిన్న చిన్న ఉదాహరణలతో వివరించారు. ఒక్కొక్క ప్రశ్న చదువుతుంటే మన ల్ని దృష్టిలో పెట్టుకొనే వేశారా? అనిపిస్తుంది. సమాధానాల్లో భాగంగా వివిధ శ్లాబులు, పన్ను రిటర్నులు పొందుపరిచారు. ఏ ఆదాయం ఉంటే ఏ ఫారం వేయాలి? లేదా ఎవరు ఏ ఫారం వేయాలి? ‘ఎవరు’ అన్న ప్రశ్నకి ఆ అసెసీకి ఏయే ఆదాయం ఉందని అడగాలి?. జీతం/పెన్షన్; ఒక ఇంటి మీదే ఆదాయం (నష్టం కాకుండా); ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఇళ్ల మీద ఆదాయం; ఇతర ఆదాయాలు (లాటరీ, గుర్రప్పందాలు కాకుండా); క్యాపిటల్ గెయిన్స్; వ్యాపారం మీద లాభం/నష్టం; వృత్తి మీద లాభనష్టాలు లాంటివి. ఏ ఫారం మీద విదేశీ ఆస్తులు/ఆదాయం వేయాలో పేర్కొన్నారు. కంపెనీలు, ట్రస్టులు, సొసైటీలు ఇలా నిర్దిష్టంగా విభజించారు. ఇదికాకుండా ఏ ఏ ఫారంలో ఏయే ఆదాయాలు చూపించాలి అని ఎంతో వివరంగా చెప్పారు. రిఫండ్‌ను ఎలా క్లెయిమ్ చేయాలి?. ఇన్కమ్ ట్యాక్ రిటర్నులు, ఈ-ఫైలింగ్ ఎలా వేయాలో తెలియజేశారు. రకరకాల పద్ధతులతోపాటు ఎలా వెరిఫై చేయాలో కూడా చెప్పారు. అంతేకాకుండా కొన్నిసార్లు ఉద్యోగస్తుల విషయంలో యాజమాన్యాలు తప్పులు చేస్తూ ఉంటాయి. వీటిని సరిదిద్దుకోవాలి. వాటినన్నింటినీ సైట్లో వివరించారు. పాస్వర్డ్ మరచిపోతే కొత్త పాస్‌వర్డ్‌ను ఎలా తెచ్చుకోవాలో కూడా తెలిపారు. అందుకే వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌ను దర్శించండి. వివరాలు అర్థం చేసుకోండి. మీ రిటర్నులను మీరే దాఖలు చేసుకోవచ్చు. - ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి , కె.వి.ఎన్ లావణ్య
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
- మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Advertisement