-
గ్రాండ్‌స్లామ్ టైటిళ్లే కాదు జరిమానా పొందడంలోనూ రికార్డే
24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలన్న నొవాక్ జొకోవిచ్ కలను చెరిపేశాడు స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్. ఆదివారం ఇద్దరి మధ్య జరిగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ హోరాహోరీగా సాగింది. కొదమ సింహాల్లా తలపడిన ఇద్దరిలో ఎవరు తేలిగ్గా ఓడిపోయేందుకు ఒప్పుకోలేదు. అయితే తొలి సెట్ ఓడినప్పటికి రెండు, మూడు సెట్లు గెలిచి ఆధిక్యంలోకి వచ్చిన అల్కరాజ్ ఇక ఈజీగా చాంపియన్ అవుతాడని అంతా ఊహించారు. కానీ జొకోవిచ్ నాలుగో సెట్లో ప్రతిఘటించడంతో పాటు సెట్‌ను గెలుచుకొని రేసులోకి వచ్చాడు. అయితే కుర్రాడి కదలికల ముందు జొకోవిచ్ అనుభవం పనికిరాలేదు. ఐదో సెట్లో పోరాడినప్పటికి అల్కరాజ్ దూకుడు ముందు ఓడిపోవాల్సి వచ్చింది. తాజాగా వింబుల్డన్ ఫైనల్ సందర్భంగా టెన్నిస్ రాకెట్‌ను విరగొట్టినందుకు గానూ జొకోవిచ్‌కు భారీ జరిమానా పడింది. ఐదో సెట్లో భాగంగా అల్కరాజ్ సర్వీస్ బ్రేక్ చేసిన జొకోవిచ్.. కాసేపటికే తన సర్వీస్‌ను కోల్పోయాడు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకొని కోపంతో రాకెట్‌ను నెట్పోస్ట్కు బలంగా విసిరికొట్టాడు. దీంతో రాకెట్ రెండు ముక్కలయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదంతా గమనించిన అంపైర్ ఫెర్గూస్ ముర్ఫీ జొకోవిచ్‌కు ఫీల్డ్‌లోనే వార్నింగ్ ఇచ్చాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం సెర్బియా స్టార్‌కు 8వేల అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 6లక్షల 50వేలు) జరిమానా విధించారు. కాగా టెన్నిస్‌లో 2023 ఏడాదిలో జొకోవిచ్‌కు విధించిన జరిమానా ఇప్పటివరకు అత్యధికమని చెప్పొచ్చు. RACQUET SMASH: Novak Djokovic was unable to keep his cool as his long reign at Wimbledon was brought to an end by Spaniard Carlos Alcaraz in an epic men's singles final. 🎾 #9News HIGHLIGHTS: https://t.co/AxhB6GIW6R pic.twitter.com/QKZZCpmZld — 9News Australia (@9NewsAUS) July 17, 2023 చదవండి: 'భోజన ప్రియుడ్ని చూశాం.. వాహన ప్రియుడ్ని చూడడం ఇదే తొలిసారి' రెక్కలు కట్టుకు తిరుగుతున్న రషీద్ ఖాన్.. ఎక్కడ చూసినా అతడే..! -
సానియా ‘స్వచ్ఛ్ భారత్’
హైదరాబాద్‌లో రోడ్డును శుభ్రం చేసిన టెన్నిస్ స్టార్ సాక్షి, హైదరాబాద్: టెన్నిస్ రాకెట్‌తో బంతిని కొట్టడమే కాదు... చీపురుతో రోడ్లను కూడా శుభ్రం చేస్తానంటూ ముందుకొచ్చింది భారత స్టార్ సానియా మీర్జా. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘స్వచ్ఛ్ భారత్’ కార్యక్రమంలో ఈ హైదరాబాద్ అమ్మాయి కూడా భాగం పంచుకుంది. నల్లని దుస్తులు ధరించి... చేతిలో పొడవైన చీపుర్లతో గురువారం ప్రశాసన్ నగర్లో ఓ రోడ్డును సానియా శుభ్రం చేసింది. ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా, సోదరి ఆనం మీర్జాతో పాటు కొందరు స్నేహితులు కూడా పాల్గొన్నారు. పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ చేసిన ప్రతిపాదన మేరకు సానియా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సోమ్‌దేవ్, పి.వి.సింధు, దీపికా పల్లికల్, అభినవ్ బింద్రా, బాలీవుడ్ స్టార్లు షారూఖ్ ఖాన్, రితేశ్ దేశ్‌ముఖ్, డెరైక్టర్ సాజిద్‌ఖాన్, తెలుగు హీరో రామ్‌చరణ్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావులను సానియా ‘స్వచ్ఛ్ భారత్’లో పాల్గొనాలని కోరింది. ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నం దుకు సానియాను ప్రధాని మోదీ అభినందించారు. డబ్ల్యూటీఏ ఫైనల్స్ ఆడేందుకు శుక్రవారం సానియా సింగపూర్‌కు బయలుదేరనుంది.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- ఐఏఎఫ్ కాన్వాయ్‌పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement