-
దుర్గమ్మ సన్నిధిలో రాహుకాల పూజలు
కడప కల్చరల్: కడప నగరం శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో మంగళవారం మహిళా భక్తులు తమ కష్టాలను తొలగించాలంటూ అమ్మవారిని వేడుకుని రాహుకాల పూజలను నిర్వహించారు. దీక్షల్లో ఉన్న మహిళలు ఆలయంలోని అమ్మవారి మూలమూర్తికి పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు ఫణిభూషణశర్మ ఆధ్వర్యంలో రాహుకేతు సమేత గ్రహ పూజలు నిర్వహించారు. అనంతరం నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రావణ మాసంలోచివరి మంగళవారం గనుక మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
దుర్గమ్మ సన్నిధిలో టీటీడీ చైర్మన్
కడప కల్చరల్: తిరుమల–తిరుపతి దేవస్థానాల చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి శనివారం కడప నగరంలోని శ్రీ విజయదుర్గాదేవి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి వివరాలతో కూడిన గ్రంథం, పట్టువస్త్రాలు అమ్మవారి ప్రసాదంగా చదలవాడకు అందజేశారు. ఈ సందర్బంగా చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు తమకు ఆత్మీయ మిత్రుడని, 14 సంవత్సరాల తర్వాత విజయదుర్గమ్మను దర్శించుకునే అదృష్టం లభించిందన్నారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో గత సంవత్సరం గోదావరి పుష్కరాలు, ఈ సంవత్సరం కృష్ణా పుష్కరాలు విజయవంతంగా జరిగాయన్నారు. ఇందులో టీటీడీ ముఖ్యపాత్ర వహించిందని తెలిపారు. రాష్ట్రం విడివడ్డాక జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయానికి ప్రభుత్వ లాంఛనాల హోదా దక్కడంతో టీటీడీ అధ్వర్యంలో వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. రూ. 100 కోట్లతో ఒంటిమిట్టను అపర అయోధ్యగా తీర్చిదిద్దాలన్న తమ సంకల్పానికి జిల్లా ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు వెంకట సుబ్బయ్య, వికాస్ హరి, ఆదినారాయణ, శంకర్, సుధీర్, కరుణ, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్‌లైట్స్
కాంగ్రెస్‌కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్‌కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్‌రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement