Sakshi News home page

సమర్థవంతంగా పని చేశాం.. 2023లో నేరాలు తగ్గాయి: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

Published Thu, Dec 28 2023 1:59 PM

AP DGP  Rajendranath Reddy Year End Press Meet For Ap 2023 Crimes - Sakshi

గుంటూరు, సాక్షి: ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా పనిచేసిందని.. ఫలితంగానే నేరాలు తగ్గాయని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(DGP) రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఇయర్‌ ఎండింగ్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించి.. ఈ ఏడాది నమోదైన నేర గణాంకాల్ని వెల్లడించారు.   

ఆంధ్రప్రదేశ్‌లో నేరాల శాతం క్రమంగా తగ్గుతూ వస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు తగ్గాయి. అలాగే దొంగతనాలు తగ్గాయి. టూ వీలర్ దొంగతనాలు తగ్గాయి. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్యాంగులను పట్టుకున్నాం. జిల్లా ఎస్పీ నుండి కానిస్టేబుల్, హోమ్ గార్డుల వరకూ తమ కర్తవ్యాన్ని సమర్థవతంగా నిర్వర్తించారు అని కిందిస్థాయి ఉద్యోగుల్ని అభినందించారాయన. 

  • రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాం. బ్లాక్ స్పాట్స్ గుర్తించి నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలపై ప్రమాదాలు తగ్గేలా చేశాం. 7.83 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయి అని అన్నారాయన.  
  • మహిళలపై తీవ్ర నేరాలను భారీగా తగ్గించాం. మహిళలపై 168 మేజర్ కేసులను నేరుగా జిల్లా ఎస్పీలకు కేటాయించి పరిష్కరించాం. రేప్, పోక్సో, డౌరీ డెత్, మహిళా హత్యలపై జరిగిన నేరాలకు జీవిత ఖైదు శిక్షలు పడ్డ కేసులు 57..  20ఏళ్లు శిక్ష పడిన కేసులు 49.. పదేళ్లు శిక్ష పడిన కేసులు 41..  ఏడేళ్లు శిక్ష పడినవి 15 కేసులు ఉన్నాయి. అలాగే.. వరకట్నం, పొక్సో కేసులు భారీగా తగ్గాయి. 
  • ఎస్సీ, ఎస్టీ కేసులు 15.2 శాతం తగ్గాయి
  • లోక్ అదాలత్ లో 4,01,748 పెట్టీ కేసులు పరిష్కారం అయ్యాయి

     
  • సైబర్ నేరాలు గణనీయంగా 25శాతం తగ్గాయి

సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేయడం మంచి ఫలితాలనిచ్చింది 

ఎక్కువ సైబర్ నేరాలకు పాల్పడిన వారు రాజీకి వచ్చి క్షమాపణలు చెప్తున్నారు

బ్యాంకుల సమన్వయంతో సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేస్తున్నాం

యంగ్ ఆఫీసర్లకు సైబర్ నేరాల అరికట్టేందుకు అవసరమైన ట్రైనింగ్ ఇస్తున్నాం

  • రౌడీ షీటర్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం

మొత్తం 4 వేలమందిలో 1000 మంది జైల్లో ఉన్నారు

ఈ ఏడాదిలోనే 900 మంది రౌడీషీటర్లు కన్విక్ట్ అయ్యారు

200 మందిపై పీడీ యాక్ట్ లు నమోదు చేశాం

  • 10వేల ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం

గంజాయి సాగు చేసేవారికి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాము

రాష్ట్ర ప్రభుత్వం 2లక్షల 52వేల ఎకరాలను ట్రైబల్స్ కు అందించింది

గంజాయి పెడలర్స్, స్మగ్లర్, కన్జ్యుమర్స్ ఎవరినీ వదిలి పెట్టట్లేదు

ఈ మూడేళ్లలో 5లక్షల కేజీల సీజ్డ్ గంజాయిని ధ్వంసం చేశాం

  • ఏపీలో మావోయిస్టుల కదలికలు కూడా తగ్గాయి


క్రైమ్‌ గణాంకాలతో పాటు పోలీసుశాఖలో తీసుకున్న సంస్కరణలు, పోలీసు సంక్షేమం వంటి అంశాలపైనా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు.

Advertisement

What’s your opinion

Advertisement