అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం: సీఎం జగన్‌

7 Aug, 2023 18:28 IST|Sakshi

LIVE UPDATES:

► రాజమండ్రి చేరుకున్న సీఎం జగన్

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చేరుకున్నారు సీఎం జగన్‌. ఇవాళ రాత్రి ఇక్కడి ఆర్&బి అతిధి గృహంలో బస చేస్తారు. మంగళవారం(రేపు) డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.

 

► ఏలూరు జిల్లా: ముగిసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కుక్కునూరు పర్యటన.  రాజమండ్రి బయలుదేరారు.

గొమ్ముగూడెంకు వరద ముంపు బాధితులతో సమావేశంలో  పాల్గొన్న సీఎం జగన్‌

ఆర్‌ అండ్‌ ఆర్‌ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు

ఆర్‌ ఆండ్‌ ఆర్‌ ప్యాకేజీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం

జనవరి కల్లా ప్యాకేజీ అందే విధంగా చూస్తాం

అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం

2013 -14 రేట్ల తో కడతామని గత ప్రభుత్వం చెప్పింది

ఆ రేట్ల ప్రకారమే డబ్బులు ఇస్తామని కేంద్రం చెప్పింది

మనసుపెట్టి ఆలోచించాలని కేంద్రానికి సూచించాము..

కేంద్రంలో కొంత కదలిక వచ్చి సానుకూల వాతావరణం వచ్చింది

సెంట్రల్ క్యాబినెట్ అప్రూవల్ కోసం పంపారు

ఈ నెలాఖరుకు కేంద్ర క్యాబినెట్ లోకి వచ్చే అవకాశం ఉంది అది వేస్తే17వేల కోట్లు కేంద్రం ఇచ్చే అవకాశం ఉంది..

హామీ ఇచ్చిన రీతిలో 47వేల ఏకరాలకు ఐదు లక్షలు ఇస్తాము

2025 ఖరీఫ్‌ నాటికి పోలవరం పూర్తి చేసి నీరందిస్తాం

గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం ఆలస్యం

స్పిల్‌ వే కట్టకుండా డయా ఫ్రమ్‌ వాల్‌ కట్టారు

కాఫర్‌ డ్యాం కట్టకపోవడం వల్లే గ్రామాలు ముంపునకు గురయ్యాయి

కొత్త డయాఫ్రం వాల్‌ కట్టడంతో పాటు స్పిల్‌ వే పనులు పూర్తి చేస్తున్నాం

గత ప్రభుత్వాల కంటే భిన్నంగా వరద బాధితులను ఆదుకుంటున్నాం

వరదలతో ఇళ్లు దెబ్బతింటే సాయం అందిస్తున్నాం

ఏ ఒక్కరూ సాయం అందలేదనకూడదు

సహాయక చర్యల్లో కలెక్టర్లకు అన్ని రకాల అధికారాలు ఇచ్చాం

వరద బాధితులకు సాయం అందకుంటే ఫిర్యాదు చేయొచ్చు

పోలవరం డ్యాంలో మూడు  దశల్లో నీళ్లు నింపుతాం

వచ్చే 6,7 నెలల్లో మీకు రావాల్సిన ప్యాకేజీపై మంచి జరుగుతుంది

లిడార్‌ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది

లిడార్‌ సర్వే సైంటిఫిక్‌గా జరిగింది.. ఎవరికీ అన్యాయం జరగదు

భూములు కొనుగోలుకు సంబంధించి మరింత న్యాయం చేస్తాం

వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన సీఎం జగన్‌

గొమ్ముగూడెంలో  వరద బాధితులకు సీఎం జగన్‌ పరామర్శ

వరద బాధితులతో మాట్లాడిన సీఎం జగన్‌

వరద బాధితుల సమస్యలు  అడిగి తెలుసుకున్న సీఎం జగన్‌

►ఏలూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

►కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకున్న సీఎం జగన్‌

►వరద బాధితులను పరామర్శించనున్న సీఎం జగన్‌

అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో సీఎం జగన్‌ ..

►పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్‌ కోసం ఆలోచించదు
►ప్రజలకు న్యాయం చేయడమే మా సంకల్పం
►ఆర్‌&ఆర్‌ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు
►పోలవరం నిర్మాణంలో చంద్రబాబు బుద్ధిలేకుండా వ్యవహరించారు

►పోలవరం ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు.
►పునరావాస ప్యాకేజీకి త్వరలోనే కేంద్రం ఆమోదం.
►పోలవరం పరిహారం కేంద్రం స్వయంగా చెల్లించినా పర్వాలేదు.
►బాధితులకు రావాల్సిన ప్యాకేజ్‌పై మంచి జరుగుతుంది. 
►ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయపరమైన ప్యాకేజీ అందుతుంది. 
►ముంపు ప్రాతాల్లో లీడార్‌ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతోంది.
►మూడు దశల్లో పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతాం
►ఒక్కసారిగా నింపితే డ్యామ్‌ కూలిపోవచ్చు
►సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం పోలవరం డ్యాంలో నీళ్లు
►సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తున్నాం

►వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదు.
►ఏ ఒక్క బాధితుడు మిగిలిపోకుండా సాయం అందించారు
►అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

► బాధితులందరికీ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు.
►సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చాం.
►నష్ట పరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకున్నాం.
►అధికారులు వారంపాటు గ్రామాల్లోనే ఉన్నారు.

►వరద బాధితులకు నిత్యవసరాలు అందించాం, ఇళ్లు దెబ్బతిని ఉంటే రూ10 వేలు ఇవ్వాలని ఆదేశించాం
► ఇళ్లలోకి నీరు వచ్చినన వారికి రూ. 2 వేలు ఆర్థికసాయం చేశాం. 
►వరద సాయం అందకుంటే ఇక్కడికి వచ్చి నాకు చెప్పండి
►ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే మా తాపత్రయం
►డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం మా ప్రభుత్వానికి లేదు.

►అల్లూరి సీతారామరాజు, ఏలూరులో జిల్లాలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. కూనవరంలో వరద బాధిత ప్రజలను పరామర్శించారు. వరద సహాయ, పునరావాస చర్యలను అడిగి తెలుసుకున్నారు. 

►తాడేపల్లి నుంచి వరద ప్రాంతాల పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయలుదేరారు. తొలుత ఏఎస్ఆర్ జిల్లా కూనవరం, వీఆర్ పురం మండలాల బాధితులను సీఎం కలవనున్నారు.

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో సోమవారం పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కూనవరం, వీఆర్‌పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడనున్నారు. అనంతరం కుక్కునూరు మండలం గొమ్ముగూడెం సందర్శించనున్నారు. సాయంత్రం రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. రాత్రికి అక్కడే బసచేయనున్నారు.

మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటించి, వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో సీఎం జగన్‌ నేరుగా మాట్లాడనున్నారు. వరద సహాయ, పునరావాస చర్యలు అమలు చేసిన తీరుపై స్వయంగా బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకోనున్నారు. గోదావరి వరదలతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో ఇటీవల పలు ప్రాంతాలు వరద ముంపునకు గురైన విషయం తెలిసిందే.
చదవండి: హానీట్రాప్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం పాక్‌ చేతిలోకి?

సీఎం జగన్‌ షెడ్యూల్‌
సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడతారు. కూనవరం బస్టాండ్‌ సెంటర్‌లో కూనవరం, వీఆర్‌ పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకుంటారు.

అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. సాయంత్రానికి రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు.

అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తానేలంక రామాలయంపేట గ్రామం వెళతారు. అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

మరిన్ని వార్తలు