Sakshi News home page

చెట్టంత కొడుక్కి కాలు పోయింది.. కానీ జీవితం రోడ్డున పడలేదు

Published Tue, Nov 28 2023 4:16 AM

navaratnalu schemes in andhra pradesh - Sakshi

ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 2019లో ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టోను.. ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే మనసా వాచా ఆచరణలోకి తీసుకురావటం మొదలుపెట్టారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆడిన మాట తప్పలేదు. ఆరంభించిన ఏ పథకాన్నీ ఆపలేదు. ఫలితంగా రాష్ట్రంలో కోట్లాది మందికి నవరత్న పథకాలు అండగా నిలిచాయి. చిన్నారులు మొదలు పండు ముదుసలి వరకు అందరూ ఆనందంగా జీవించేలా వనరులు సమకూరుతున్నాయి.

కనీస అవసరాలైన కూడు, గూడు, ఆరోగ్యానికి ఢోకా లేదనే విషయం ఊరూరా కళ్లకు కడుతోంది. పేదల జీవితకాల కల అయిన ‘సొంతిల్లు’ సాకారం కావడంతో కొత్తగా ఊళ్లకు ఊళ్లే వెలుస్తుండటం కనిపిస్తోంది. అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత, ఆసరా అండగా నిలుస్తోంది. పేదింటి పిల్లలకు పెద్ద చదువులు.. విదేశీ విశ్వవిద్యాలయాల్లో సైతం చదివేందుకు రాచబాట సిద్ధమైపోయింది. అన్నదాతకు వ్యవసాయం పండుగగా మారింది. వెరసి నవరత్నాల వెలుగులు ప్రతి ఊళ్లోనూ ప్రసరిస్తున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ తపన, తాపత్రయం, ఆకాంక్ష ఫలించిన తీరు లబ్ధిదారుల మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.

ఆరోగ్యశ్రీ లేకుంటే ఏమయ్యేదాన్నో! 
మేము ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలోని బీసీ కాలనీలో ఉంటున్నాం. గతంలో చేనేత పని చేస్తూ జీవించేవాళ్లం. నాకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ముగ్గురికీ వివాహమైంది. ప్రైవేటు బస్సులో క్లీనర్‌గా పనిచేసే నా కుమారుడు వెంకటేశ్వర్లుకు అనారోగ్య సమస్యలు తలెత్తి కాలు తీసేయాల్సి వచ్చింది. చెట్టంత కొడుక్కు కాలు తీసేయడంతో ఏం చే­యాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాం.

కు­­టుంబం రోడ్డున పడిపోయింది. చివ­­రికి కు­టుంబ భారం మొత్తాన్నీ నేనూ, నా కోడలు సునీ­త మోస్తున్నాం. ఏదోలా సంసారాన్ని నె­ట్టు­కొస్తున్న సమయంలో నాకు రెండేళ్ల కిందట తీవ్రంగా సుస్తీ చేసింది.  గుండె ఆపరేషన్‌ చేయించాలని వైద్యులు చెప్పారు. దీంతో నేను వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రై­వేట్‌ వైద్యశాలకు వెళ్లాను. అక్కడ వాళ్లు ఆపరేషన్‌ ఖర్చు రూ.5 లక్షలవుతుందన్నారు.  రెక్కాడితేగానీ డొక్కా­డని పరిస్థితుల్లో ఆపరేషన్‌ కోసం రూ.5 లక్షలు ఎక్కడి నుంచి తేగలను? నేను మరింత కుంగిపోయాను.

నాకేమైనా జరిగితే అంగవైకల్యంతో ఉన్న నా కుమారుడి గతి ఏమవుతుందోన­ని మరింత బెంగ పట్టుకుంది. ఆ సమయంలో ఆరోగ్య శ్రీ నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది.  ఉ­చితంగా ఆపరేషన్‌ చేశారు. ఇప్పు­డు నేను ఆ­రో­­గ్యంగా ఉన్నా. ప్రభుత్వం కల్పించిన చే­యూత, ఆసరా, వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాలు నాకూ వర్తించాయి. మూడు వి­డతలుగా చేయూత రూ.56,250 వచ్చింది. వైఎ­స్సార్‌ ఆసరా కింద రూ.31,800 లబ్ధి చేకూరింది. నేతన్న నేస్తంలో భాగంగా రూ.72 వేలు వచ్చా­యి.  డబ్బులతో చిల్లర కొట్టు పెట్టుకున్నాను.  పచ్చళ్లు తయారు చేసి అమ్ముతున్నా. నెలకు రూ.20 వేల ఆదాయం వస్తోంది.      – తిరుపతమ్మ (పి.హనుమంతరెడ్డి, విలేకరి, బేస్తవారిపేట)  

రుణమాఫీతో ఆర్థిక ఆసరా   
మేము విశాఖపట్నం నగరంలోని అక్కయ్యపాలెం అబిద్‌నగర్‌ కాలనీలో ఉంటున్నాము. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినా చెయ్యలేదు. కానీ జగనన్న ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి నాలాంటి పేద కుటుంబాలకు ఆర్థికంగా ఆసరా కల్పించారు. నేను, నా భర్త, ఇద్దరు పిల్లల­తో బతుకుదెరువుకోసం సాలూరు నుంచి విశా­­ఖకు వలస వచ్చాము. అబిద్‌నగర్‌లో నా భర్త అపార్టుమెంట్‌ వాచ్‌మేన్‌గా పని చేస్తున్నా­డు.

ఇద్దరు పిల్లల్లో ఒకరిని ఐటీఐ, మరొకరిని ఇంటర్‌ చదివిస్తున్నాము. 2014 నుంచి 44వ వార్డు బిస్మిల్లా ఎంపీఎస్‌ గ్రూప్‌లో సభ్యురాలుగా కొనసాగుతున్నాను. అప్పట్లో గ్రూప్‌లో ఒకొక్కరికి రూ.50 వేల చొప్పున డ్వాక్రా రుణం ఇచ్చారు. అందులో కొంత వరకు నెలనెలా కట్టాను. సీఎం జగన్‌ నవరత్నాల పథకాల్లో భాగంగా వైఎస్సార్‌ ఆసరా పథకం కింద 2019 ఏప్రిల్‌ నాటికి ఉన్న డ్వాక్రా రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ వార్త విన్నాక చాలా సంతోషం కలి­గింది. ఆసరా పథకం వల్ల నాకు రూ.25,465 వరకు రుణ మాఫీ అయ్యింది.

విడతకు రూ.6,366 చొప్పున మూడు విడతల రుణం మాఫీ అయ్యింది. వాచ్‌మేన్‌గా మాకు ఆదా­యం అంతంత మాత్రమే. అటువంటి సమయంలో ఆసరా పథకం కింద రుణమాఫీ జరగడం మా కుటుంబానికి చాలా వరకు ఆర్థిక భారం తప్పింది. ఐదు నెలల కిందట మళ్లీ మా గ్రూపునకు ఏడున్నర లక్షల రుణం మంజూరైంది. ఒక్కో సభ్యురాలికి రూ.75 వేల రుణం లభించింది. సున్నా వడ్డీ కింద రూ.2,539 నా­లుగు విడతలుగా జమ అయింది. కరోనా సమయంలో పనులు లేక, ఆదాయం లేక ఇంటి పట్టున ఉంటున్న సమయంలో సున్నా వడ్డీ జమ కావడంతో మా కుటుంబాన్ని ఆర్థికంగా చాలా ఆదుకుంది.  – ఎస్‌.రవణమ్మ, డ్వాక్రా సభ్యురాలు  (బి.అనితా రాజేష్, విలేకరి, సీతంపేట, విశాఖపట్నం)  

అప్పుచేసే బాధ తప్పింది 
మాది అనకాపల్లి జిల్లా చోడవరం మండలం పీఎస్‌పేట గ్రామం. మా కు­టుంబం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తోంది. మా తాత, తండ్రుల నుంచి వ్యవసాయమే జీవనాధారం. మా పొలాల పక్కనే పెద్దేరు నది పారుతుండటంతో నీటికి ఇబ్బంది లేదు. అందుకే వరి, చెరకు పంటలు వేస్తుంటాము. నాకు ఒకటిన్నర ఎకరం పొలం ఉంది. ఏటా 70 సెంట్లలో వరి, 80 సెంట్లలో చెరకు వేస్తుంటాను.

ఈ ఏడాది కూడా వరి, చెరకు పంటలు వేశాను. వరికి ఉడుపుల నుంచి కోతలు వరకు సుమారు రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. ఈ మొత్తం ఖర్చు అంతా నేనే భరించాల్సి వచ్చేది. అప్పు చేసి పంటకు పెట్టుబడి పెట్టేవాడిని. ఒక్కోసారి తుపాన్లు వచ్చినప్పుడు పంట పూర్తిగా నష్టపోయి పెట్టుబడి కూడా వచ్చేది కా­దు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దయవల్ల నాలుగేళ్లుగా వ్యవసాయానికి పెట్టు­బడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున అందుతోంది. ఈ సొమ్ము ప్రభుత్వం ఇవ్వడం వల్ల నాకు అప్పులు చేసే బాధ తప్పింది.

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ మొదలై ఇప్పుడు వరి పంట వెన్ను దశలో ఉంది. ఇది పెట్టుబడులు పెట్టే అదును. ఈ సమయంలో రైతు భరోసా కింద మొదటి విడతగా రూ.4 వేలు ఇటీవలే నా ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు పొలానికి ఎరువులు, మందులు, కలుపు పనులు చేయించాల్సి ఉంది. ఈ రైతు భరోసా డబ్బులు నాకే కాదు రైతులందరికీ ఎంతో ఉపయోగపడ్డాయి.   – గొలగాని ఎరుకునాయుడు  (కొప్పాక భాస్కర్‌రావు, విలేకరి, చోడవరం)  
 

Advertisement

What’s your opinion

Advertisement