Sakshi News home page

మహిళా సాధికారతకు సీఎం జగన్‌ కృషి: సజ్జల

Published Tue, Mar 8 2022 7:47 PM

Sajjala Ramakrishnareddy Speech In Womens Day Celebrations - Sakshi

సాక్షి, విజయవాడ: మహిళా సాధికారతకు పూర్తిస్థాయి అర్థం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సీఎం అయిన తర్వాతే వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  ఏపీ సచివాలయ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, అమ్మ ఒడి పథకం సీఎం జగన్ ఆలోచనల్లోంచి పుట్టిందేనన్నారు. కుటుంబం బాగుండాలంటే నిర్ణయాధికారం మహిళకు ఉండాలని ఈ ప్రభుత్వంలో మహిళలకు ఆ అధికారం జగన్ కల్పించారని సజ్జల అన్నారు.

చదవండి: ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది: సీఎం జగన్‌

‘‘మహిళల పేరిటే ఇళ్ల పట్టాలిచ్చి వారికి సొంత ఆస్తి కల్పించారు. మహిళల పట్ల ఆయనకు అమితమైన విశ్వాసం ఉందని అనేక చర్యల ద్వారా నిరూపించుకున్నారు. మహిళల భద్రత కోసం దిశ యాప్ రూపొందించారు. ఏపీలో వచ్చే ఐదారేళ్లలో మహిళలు మరింత శక్తివంతంగా మారుతారు. ఏపీ నుంచి వచ్చారంటే ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నవారని అంతా చెప్పుకుంటారు. మహిళల కోసం ఎలాంటి సూచనలు చేసినా ఈ ప్రభుత్వం స్వీకరిస్తుందని’’ సజ్జల తెలిపారు.

‘‘శతాబ్దాలుగా అనేక అసమానతలకి గురైంది మహిళే. ఇటీవల‌ కాలంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. విధాన పరమైన నిర్ణయాల అమలులో సచివాలయ మహిళా ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వాలు ఏమైనా ఆ నిర్ణయాలు అమలులో మీదే కీలకపాత్ర. సీఎం వైఎస్ జగన్ గత మూడేళ్లగా మహిళా సాధికారికతకి కృషి చేస్తున్నారని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement