Sakshi News home page

Today Horoscope: ఈ రాశికి వారికి అన్నింటా విజయమే, శుభవార్తలు వింటారు

Published Sun, Jan 8 2023 6:53 AM

Today Horoscope 08 01 2023 - Sakshi

మేషం: ఎంతగా కష్టపడినా ఫలితం ఉండదు. ఆస్తి వివాదాలు. బందువర్గంతో తగాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. దేవాలయదర్శనాలు. 

వృషభం: కార్యజయం. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. అరుదైన సన్మానాలు. ఇంతకాలం నిరీక్షణ ఫలిస్తుంది. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. 

మిథునం: ఆదాయం కొంత తగ్గుతుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. అనారోగ్యం. కుటుంబసమస్యలు వేధిస్తాయి. బంధువుల నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. 

కర్కాటకం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. 

సింహం: కొన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుంటారు. దూరప్రయాణాలు. అనారోగ్యం, ఔషధసేవనం. చోరభయం. కుటుంబసభ్యులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహవంతంగా ఉంటుంది. 

కన్య: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

తుల: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఇంట శుభకార్యాల నిర్వహణ. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సన్మానాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. దేవాలయాలు సందర్శిస్తారు. 

వృశ్చికం: రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్నేహితులతో అకారణవైరం. చోరభయం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. 

ధనుస్సు: ఆదాయానికి మించి ఖర్చులు. కుటుంబంలో విభేదాలు. ప్రయాణాలు చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు ఎదురవుతాయి. 

మకరం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. బంధువర్గంతో వివాదాలు తీరతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనంగా ఉంటాయి. 

కుంభం: శుభకార్యాలు నిర్వహిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. కార్యజయం. శుభవర్తమానాలు.  స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మీనం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో వైరం. ఆస్తి వివాదాలు. ఇంటి నిర్మాణాలలో అవరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

Advertisement

What’s your opinion

Advertisement