Sakshi News home page

Daily Horoscope: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది

Published Sun, Dec 3 2023 5:39 AM

today rasi phalalu 03 12 2023 daily horoscope  - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి: బ.షష్ఠి సా.6.23వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: ఆశ్లేష రా.9.24 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: ఉ.9.08 నుండి 10.52 వరకు, దుర్ముహూర్తం: ప.3.56 నుండి 4.44 వరకు, అమృతఘడియలు: రా.7.38 నుండి 9.23 వరకు. రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు, యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు, సూర్యోదయం : 6.18 సూర్యాస్తమయం :  5.20.

మేషం... బంధువులతో మాటపట్టింపులు. రుణయత్నాలు. తీర్థయాత్రలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు..

వృషభం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మిథునం... ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. ఒప్పందాల్లో ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. శ్రమకు ఫలితం అంతగా ఉండదు.

కర్కాటకం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహన, కుటుంబసౌఖ్యం. వృత్తి,వ్యాపారాలలో ముందడుగు.

సింహం... వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య భంగం. కుటుంబసభ్యులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

కన్య.... కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

తుల.... నూతన ఉద్యోగయోగం. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం.... మిత్రులతో మాటపట్టింపులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ఆధ్యాత్మిక చింతన.

ధనుస్సు... రుణఒత్తిడులు. పనులలో కొద్దిపాటి ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

మకరం..... కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార , ఉద్యోగాలలో పురోగతి.

కుంభం... వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం..... పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు. దూరప్రయాణాలు. 

Advertisement

What’s your opinion

Advertisement