అగ్రి ఫుడ్‌ స్టార్టప్‌ల్లోకి జోరుగా పెట్టుబడులు | Sakshi
Sakshi News home page

అగ్రి ఫుడ్‌ స్టార్టప్‌ల్లోకి జోరుగా పెట్టుబడులు

Published Fri, Dec 17 2021 4:12 PM

Agri Food Startups Attracts More Investments - Sakshi

న్యూఢిల్లీ: వ్యవసాయ, ఆహార సంబంధిత స్టార్టప్‌లకు పెట్టుబడిదారుల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. 2019–20తో పోలిస్తే గడిచిన ఆర్థిక సంవత్సరం 2020–21లో ఏకంగా 97 శాతం పెరిగి 2.1 బిలియన్‌ డాలర్లు (రూ.15,750 కోట్లు) మేర పెట్టుబడులు ఈ తరహా స్టార్టప్‌ల్లోకి వెళ్లినట్టు వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు ఏజీఫండర్, ఓమ్నివోర్‌ ఒక నివేదిక రూపంలో తెలిపాయి. 2019–20లో 136 పెట్టుబడుల ఒప్పందాలు చోటు చేసుకోగా, 2020–21లో 189కు పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది.

ఈ పెట్టుబడుల్లో రెస్టారెంట్ల మార్కెట్‌ప్లేస్‌ సంస్థలు ఎక్కువ మొత్తాన్ని సొంతం చేసుకున్నట్టు పేర్కొంది. మొత్తం పెట్టుబడుల్లో 64 శాతం.. 1.33 బిలియన్‌ డాలర్లు వీటిల్లోకే వెళ్లాయి. ఇందులో జొమాటో 1.2 బిలియన్‌ డాలర్ల సమీకరణ కూడా ఉంది. రైతులు, వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించే స్టార్టప్‌లకూ పెట్టుబడుల మద్దతు పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది.    
 

Advertisement
Advertisement