పీకలదాకా మద్యం తాగి విమానం నడుపుతున్న పైలెట్లు!

10 May, 2022 21:39 IST|Sakshi

విమానయాన రంగంలో 30కి పైగా వివిధ రకాలైన ఉద్యోగాలుంటాయి.వాటిలో మిగిలిన ఉద్యోగుల విధులు ఎలా ఉన్నా..ఆకాశంలో ఎగిరే విమానాన్ని నియంత్రించే అధికారం పైలెట్లకు మాత్రమే ఉంటుంది. అందుకే ఈ విభాగంలో ఉద్యోగులు ఎంతో నిబద్ధతో పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇటీవల విమానం పైలెట్ల గురించి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) సంస్థ విస్తుపోయే వాస్తవాల్ని బయట పెట్టింది. 


ఏవియేషన్‌ రెగ్యూలేటర్‌ ప్రకారం..విమానంలో ప్రయాణించే ముందు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ (బీఏ) టెస్టుల్లో విఫలమైన విమాన సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన విధుల్లో ఉంటూ ఉద్యోగులకు తీరు ఇలాగే ఉంటుందా అని ప్రశ్నించింది. ఎందుకంటే ఏవియేషన్ రెగ్యులేటర్ జనవరి 1, 2022 నుండి నాలుగు నెలల కాలంలో 48 మంది సిబ్బందికి బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌లు చేయగా మద్యం సేవించడంతో పాటు ఇతర నిబంధనల్ని ఉల్లంఘించారు. దీంతో విమానయాన సిబ్బందిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చర్యలు తీసుకున్నారు.
  
ఈ నాలుగు నెలల కాలంలో బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌లో 9మంది పైలెట్లు, 30మంది క్యాబిన్ క్రూ సిబ్బందికి మద్యం సేవించినట్లు గుర్తించారు. వీరిలో ఇద్దరు పైలెట్లు, ఇద్దరు క్యాబిన్‌ క్రూ సిబ్బంది రెండోసారి మద్యం తాగినట్లు తేలడంతో మూడేళ్లపాటు సస్పెండ్‌ చేసింది. మిగిలిన 37 మంది సిబ్బందిని తొలిసారి పాజిటివ్‌ రావడంతో వారిని సైతం 3 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.  

కాగా, విమానయాన సంస్థలు కాక్‌పిట్, క్యాబిన్ క్రూ సభ్యులలో 50 శాతం మందిని రోజూ ప్రీ ఫ్లైట్ ఆల్కహాల్ టెస్ట్‌లు చేయించుకోవాలని గత నెలలో డీజీసీఏ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తికి ముందే సిబ్బంది విమాన ప్రయాణానికి ముందే ఆల్కహాల్ టెస్ట్‌లు చేయించుకోవాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా 2 నెలలు బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌ల్ని నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టి, విమానయాన సర్వీసులు ప్రారంభం కావడంతో బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌ల‍్ని మళ్లీ ప్రారంభించారు. తాజాగా నిర్వహించిన ఈ టెస్ట్‌ల్లో విమానయాన సిబ్బంది బాగోతం బట్టబయలైంది.

చదవండి👉మద్యం తాగి కాక్‌పిట్లో ప్రయాణం

మరిన్ని వార్తలు