Sakshi News home page

తీవ్ర ఇబ్బందులు: రెండు రోజులు విమానాలను రద్దు చేసిన సంస్థ

Published Tue, May 2 2023 4:39 PM

Go First To Suspend Flights For 2 Days Due To Severe Fund Crunch - Sakshi

న్యూఢిల్లీ: వాడియా గ్రూప్ యాజమాన్యంలోని బడ్జెట్ ధరల విమానాయాన సంస్థ గోఫస్ట్‌ ఫండ్‌ ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ కారణంగా రెండు రోజుల పాటు విమాన సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.  (IBM To Freeze Hiring: వేలాది ఉద్యోగాలకు ఏఐ ముప్పు: ఐబీఎం షాకింగ్‌ న్యూస్‌)

తీవ్రమైన నిధుల కొరత కారణంగా (బుధవారం, గురువారం (మే 3, 4 తేదీలు) విమానాలను రద్దు చేసింది. ఈ మేరకు గోఫస్ట్‌ సీఈఓ కౌశిక్ ఖోనాను ఉటంకిస్తూ పీటీఐ నివేదించింది. అంతేకాదు  నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముందు స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసింది.

ప్రాట్ అండ్‌ విట్నీ (P&W) ఇంజిన్‌లను సరఫరా చేయకపోవడంతో 28 విమానాలను  తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఖోనా పీటీఐకి చెప్పారు. స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియల దాఖలు దురదృష్టకర నిర్ణయమని పేర్కొన్నారు. కానీ కంపెనీ ప్రయోజనాల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. (రెనాల్ట్‌ కైగర్‌ కొత్త వేరియంట్‌ వచ్చేసింది.. ఆర్‌ఎ‍క్స్‌జెడ్‌ వెర్షన్‌పై భారీ తగ్గింపు)

Advertisement

What’s your opinion

Advertisement