Sakshi News home page

జీఎస్టీ రివార్డ్‌ స్కీమ్‌: బిల్లు ఉంటే చాలు.. రూ.కోటి వరకూ నగదు బహుమతులు

Published Sun, Aug 20 2023 8:12 PM

GST reward scheme customers upload invoice participate lucky draw - Sakshi

GST reward scheme: చాలా కాలంగా ఎదురుచూస్తున్న 'మేరా బిల్ మేరా అధికార్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. దీని ద్వారా ఏదైనా కొనుగోలుకు సంబంధించిన జీఎస్టీ ఇన్‌వాయిస్‌ని మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేసి రివార్డ్ పొందవచ్చు. 

ఇన్‌వాయిస్ ప్రోత్సాహక పథకం కింద రిటైలర్ లేదా హోల్‌సేల్‌ వ్యాపారి నుంచి తీసుకున్న ఇన్‌వాయిస్‌ను యాప్‌లో అప్‌లోడ్ చేసినవారికి నెలవారీగా, త్రైమాసికంవారీగా లక్కీ డ్రా తీసి రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి వరకూ నగదు బహుమతులు ఇవ్వనున్నట్లుగా సంబంధిత అధికారులు పీటీఐ వార్తా సంస్థతో పేర్కన్నారు. 

'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ యాప్ ఐవోఎస్‌, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌లో అప్‌లోడ్ చేసే ఇన్‌వాయిస్‌లో విక్రేతకు సంబంధించిన జీఎస్టీఐఎన్‌, ఇన్‌వాయిస్ నంబర్, చెల్లించిన మొత్తం, పన్ను మొత్తం వివరాలు ఉండాలి. ఒక వ్యక్తి ఒక నెలలో గరిష్టంగా 25 ఇన్‌వాయిస్‌లను యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. అయితే ఈ ఇన్‌వాయిస్ కనీసం రూ. 200 కొనుగోలు విలువను కలిగి ఉండాలి.

 

ప్రతి నెలా లక్కీ డ్రాలు
కంప్యూటరైజ్డ్ లక్కీ డ్రాల ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. ప్రతి నెలా 500కు పైగా లక్కీ డ్రాలు నిర్వహిస్తారు. ప్రైజ్ మనీ రూ.లక్షల్లో ఉంటుంది. అలాగే త్రైమాసానికి రెండు చొప్పున లక్కీ డ్రాలు తీస్తారు. ఇక్కడ రూ. 1 కోటి వరకూ నగదు బహుమతి ఉంటుంది.

ఈ పథకం తుది దశకు చేరుకుందని, ఈ నెలలోనే దీన్ని ప్రారంభించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. జీఎస్టీ ఎగవేతను అరికట్టడానికి , వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లకు మించిన సంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ని తప్పనిసరి చేసింది. 'మేరా బిల్ మేరా అధికార్' స్కీమ్ బీ2సీ కస్టమర్ల విషయంలో కూడా ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ అంగీకరిస్తుంది. తద్వారా కొనుగోలుదారు లక్కీ డ్రాలో పాల్గొనేందుకు అర్హత పొందవచ్చు.

ఇదీ చదవండి: Revised I-T rules: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నిబంధనల్లో మార్పులు.. భారీగా పన్ను ఆదా!

Advertisement

What’s your opinion

Advertisement