Sakshi News home page

నజారాలో ఎస్‌బీఐ ఎంఎఫ్‌ రూ.410 కోట్ల పెట్టుబడి

Published Fri, Sep 8 2023 6:39 AM

Nazara Tech raises Rs 410 crore from SBI Mutual Fund - Sakshi

ముంబై: ప్రముఖ గేమింగ్, ఈ స్పోర్ట్స్‌ సేవల కంపెనీ నజారా టెక్నాలజీస్‌లో ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ భారీ పెట్టుబడులు పెట్టనుంది. నజారా టెక్నాలజీస్‌ ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌లో పాల్గొని రూ.410 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. నజారా టెక్నాలజీస్‌ రూ.4 ముఖ విలువ కలిగిన 57,42,296 షేర్లను, ఒక్కోటీ రూ.714 చొప్పున జారీ చేయనుంది.

ఈ  విలువ రూ.409.90 కోట్లు, ఎస్‌బీఐ మల్టీక్యాప్‌ ఫండ్, ఎస్‌బీఐ మాగ్నమ్‌ గ్లోబల్‌ ఫండ్, ఎస్‌బీఐ టెక్నాలజీస్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌ ద్వారా ఎస్‌బీఐ  ఫండ్‌ ఈ ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ నెల 4న జెరోదా వ్యవస్థాపకులైన నితిన్, నిఖిల్‌ కామత్‌ సోదరులు సైతం ఒక్కో షేరుకు ఇదే ధరపై రూ.100 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం.

Advertisement

What’s your opinion

Advertisement