టిక్‌టాక్‌ సంచలన నిర్ణయం..! వైరల్‌ వీడియోస్‌ నేరుగా యూజర్ల వద్దకు..! | Sakshi
Sakshi News home page

TikTok: టిక్‌టాక్‌ సంచలన నిర్ణయం..! వైరల్‌ వీడియోస్‌ నేరుగా యూజర్ల వద్దకు..!

Published Sun, Dec 19 2021 9:11 PM

Tiktok To Launch Food Delivery Service From Viral Videos In US - Sakshi

ప్రముఖ షార్ట్‌ వీడియో ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫుడ్‌ డెలివరీ సేవలను అమెరికాలో ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టిక్‌టాక్‌లో వైరలైన ఫుడ్‌ వీడియోస్‌లోని ఆహారాన్ని యూజర్లకు డెలివరీ చేసే అవకాశాలపై ప్రణాళికలు రచిస్తోన్నట్లు 9To5Mac నివేదించింది. ఫుడ్ డెలివరీ సేవతో వైరల్ ఫుడ్ వీడియోలను మరో స్థాయికి తీసుకెళ్లే విధంగా కంపెనీ ప్లాన్‌ చేస్తోంది. ఈ ఫుడ్‌ను టిక్‌టాక్‌ కిచెన్‌ పేరిట అమెరికాలోని ఆయా ప్రాంతాల్లో ఫుడ్‌ డెలివరీ చేయనుంది.  వర్చువల్‌ డైనింగ్‌ కాన్సెప్ట్‌లతో భాగస్వామ్యమై టిక్‌టాక్‌ కిచెన్‌ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 

2022లో ప్రారంభం..!
టిక్‌టాక్ కిచెన్ సేవలను అమెరికాలో  2022లో ప్రారంభించనుంది. అమెరికాలోని దాదాపు 300 ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభంకానున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి 1,000 కంటే ఎక్కువ ప్రాంతాల్లో సేవలందించేందుకు కంపెనీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

వైరల్‌ ఫుడ్‌ వీడియోస్‌ మెనూగా..!
టిక్‌టాక్‌లో వైరలైన ఫుడ్‌ వీడియోస్‌ మెనును కస్టమర్లకు అందుబాటులో ఉంచనుంది. ఇప్పటివరకు టిక్‌టాక్‌లో వైరల్ అయిన బేక్డ్ ఫెటా పాస్తా, స్మాష్ బర్గర్, కార్న్ రిబ్స్ , పాస్తా చిప్స్ వంటి వంటకాలను కస్టమర్‌లు ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ కల్పించనుంది. కాగా ఒక నివేదిక ప్రకారం ఈ డిషెస్‌ టిక్‌టాక్ కిచెన్ మెనూలో శాశ్వతంగా ఉంటాయా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. వైరలైన ఫుడ్‌ డిషెస్‌కు ఆయా క్రియేటర్లకు క్రెడిట్‌ను టిక్‌టాక్‌ అందజేయనుంది. 
చదవండి: రూ.10 వేల కంటే తక్కువ ధర..! హాట్‌కేకుల్లా అమ్ముడైన 30 లక్షల స్మార్ట్‌ఫోన్స్‌ ..!

Advertisement
Advertisement