Sakshi News home page

భారతీయులకు మరో శుభవార్త.. యూఎస్‌ వీసాల జారీలో సరికొత్త రికార్డులు!

Published Mon, Jan 29 2024 8:07 PM

Us Issued 1.4 Million Visas To Indians In 2023 - Sakshi

భారత్‌లో యూఎస్‌ వీసాల జారీలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే 2023లో వీసాల మంజూరు 60 శాతం పెరిగాయి. బీ1, బీ2 విజిటింగ్‌ వీసాల కింద దాదాపు 7లక్షల వీసాలు జారీ చేయగా.. లక్షా 40 వేల స్టూడెంట్‌ వీసాలు జారీ చేసింది అమెరికన్‌ ఎంబసీ. ఫలితంగా విజిటర్‌ వీసా అపాయింట్మెంట్‌ కోసం నిరీక్షించే సమయం 75 శాతం తగ్గింది. 
 
గత ఏడాది ఏకంగా 1.4 మిలియన్‌ యూఎస్‌ వీసాల్ని అందించింది. ఈ ఏడాది హెచ్‌1బీ వీసాల మంజూరును పరిశీలిస్తామని యూఎస్‌ ఎంబసీ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రతి 10 వీసాల్లో ఒకరిది భారతీయులదేనని తెలిపింది. 

నిరీక్షణ సమయం తగ్గింది
ప్రాసెస్ మెరుగుదల,పెట్టుబడుల కారణంగా విజిటింగ్‌ వీసాల కోసం అపాయింట్‌మెంట్ నిరీక్షణ సమయాన్ని సగటున 1,000 రోజుల నుండి  250 రోజులకు తగ్గించాయి. దీంతో విజిటింగ్‌ వీసాలు (B1/B2) యూఎస్‌ ఎంబసీ చరిత్రలో రెండవ సారి 7లక్షల కంటే అత్యధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్లు ఎంబసీ అధికారులు తెలిపారు.  



విదేశీ విద్యార్ధుల్లో భారతీయులే అధికం
భారత్‌లోని యుఎస్ కాన్సులర్ బృందం 2023లో 1,40,000 స్టూడెంట్ వీసాలను జారీ చేసింది. ఈ మంజూరు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భారీ మొత్తంలో భారతీయులకు మంజూరు చేసి వరుసగా మూడవ సంవత్సరం రికార్డు సృష్టించింది.తద్వారా అమెరికాలోని అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో భారతీయ విద్యార్థులే ఎక్కువమంది ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో చదువుతున్న ఒక మిలియన్ విదేశీ విద్యార్థులలో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు.


హెచ్‌1బీ వీసా దారలు సైతం
2023లో భారతీయులు, వారి కుటుంబ సభ్యుల కోసం 3,80,000 ఉద్యోగ వీసాలకు ప్రాసెసింగ్‌ చేయాల్సి వచ్చింది. యూఎస్‌ మిషన్‌కు కనీస అపాయింట్‌మెంట్ వెయిట్ టైమ్‌ని తగ్గించేందుకు వీలుగా కాన్సులర్ బృందం భారత్‌లోని చెన్నై, హైదరాబాద్‌లలో పిటిషన్ ఆధారిత వీసా ప్రాసెసింగ్‌ చేసే అవకాశాన్ని కల్పించింది. మరోవైపు ఈ సంవత్సరం పైలట్ ప్రోగ్రామ్ అర్హతగల హెచ్‌1 బీ హోల్డర్‌లను యునైటెడ్ స్టేట్స్‌లో వారి వీసాలను పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది.  

భారతీయులకు శుభవార్త
మహమ్మారి కారణంగా ఆలస్యం అయిన 31,000 ఇమ్మిగ్రెంట్‌ వీసా క్యూను యూఎస్‌ ముంబై కాన్సులేట్ జనరల్ తగ్గించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పెండింగ్‌లో ఉన్న ఇమ్మిగ్రెంట్ వీసా పిటిషన్‌ను కలిగి ఉన్నవారు, షెడ్యూలింగ్ కోసం సిద్ధంగా ఉన్న అభ్యర్ధులు ఇప్పుడు స్టాండర్డ్‌, ప్రీ-పాండమిక్ అపాయింట్‌మెంట్ విండోలో అపాయింట్‌మెంట్ పొందవచ్చని ఈ సందర్భంగా వీసా కోసం ఎదురు చూస్తున్నవారికి ఎంబసీ శుభవార్త చెప్పింది.  

Advertisement

What’s your opinion

Advertisement