Sakshi News home page

ముడిచమురుపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ పెంపు

Published Tue, Aug 15 2023 10:18 AM

Windfall tax on crude oil diesel hiked - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపైన, డీజిల్‌ ఎగుమతులపైన కేంద్రం విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను పెంచింది. దీనితో క్రూడాయిల్‌పై ట్యాక్స్‌ టన్నుకు రూ. 7,100 మేర పెరిగింది. అలాగే, డీజిల్‌ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని (ఎస్‌ఏఈడీ) లీటరుకు రూ. 1 చొప్పున కేంద్రం పెంచింది. దీంతో ఇది లీటరుకు రూ. 5.50కి చేరింది.

అటు విమాన ఇంధనం (ఏటీఎఫ్‌)పై కూడా లీటరుకు రూ. 2 చొప్పున సుంకం విధించింది. ఇప్పటి వరకు ఏటీఎఫ్‌పై ఎస్‌ఏఈడీ లేదు. తాజా మార్పులు ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. క్రూడ్‌ రేట్ల కారణంగా చమురు కంపెనీలు అసాధారణంగా ఆర్జిస్తున్న లాభాలపై కేంద్రం 2022 జూలై 1 నుంచి విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను విధిస్తోంది.

Advertisement

What’s your opinion

Advertisement