Sakshi News home page

జాతీయ వాలీబాల్‌ జట్టుకు చౌడేపల్లె విద్యార్థి

Published Wed, Nov 15 2023 1:38 AM

నిరంజన్‌ను అభినందిస్తున్న హెచ్‌ఎం, పీడీ    - Sakshi

చౌడేపల్లె: జాతీయ స్థాయి వాలీబాల్‌ అండర్‌ –14 పోటీలకు చౌడేపల్లె ఉన్నత పాఠశాల విద్యార్థి నిరంజన్‌ ఎంపికై నట్లు ఆ స్కూలు హెచ్‌ఎం నాగరాజారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చిట్రెడ్డిపల్లెకు చెందిన నిరంజన్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో వతరగతి చదువుతున్నాడని చెప్పారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు విశాఖపట్నం అరకులో జరిగిన అంతర్‌ జిల్లాల (రాష్ట్రస్థాయి పోటీల్లో) ప్రత్యేక ప్రతిభ చూపారన్నారు. దీంతో అతడు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. రాష్ట్రస్థాయి జట్టులో ప్రాతిని థ్యం వహిస్తూ డిసెంబరు 22 నుంచి 26 వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌ లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో నిరంజన్‌ పాల్గొంటారన్నారు. క్రీడాకారు డిని హెచ్‌ఎం, పీడీ రామచంద్ర, పీఈటీ రాజేంద్ర అభినందించి, సత్కరించారు.

జాతీయస్థాయి వాలీబాల్‌ బాలికల జట్టుకు అనుశ్రీ

జాతీయస్థాయి వాలీబాల్‌ బాలికల జట్టు కు మర్రిమాకులపల్లె ఉన్నత పాఠశాల వి ద్యార్థిని అనుశ్రీ ఎంపికై నట్లు ఆ స్కూలు హెచ్‌ఎం నాధమునినాయుడు తెలిపారు. ఇటీవల విశాఖపట్నం అరకులో జరిగి న అంతర్‌జిల్లాల రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో తలపడగా జాతీయస్థాయి జట్టుకు అనుశ్రీ ఎంపికై నట్లు పేర్కొన్నారు. అనుశ్రీని హెచ్‌ఎం, పీడీ పవన్‌కుమార్‌ అభినందించారు.

Advertisement

What’s your opinion

Advertisement