Sakshi News home page

హైదరాబాద్‌లో హైఅలర్ట్‌ ప్రకటన

Published Fri, Mar 1 2024 6:52 PM

Police Announced High Alert In Hyderabad - Sakshi

సాక్షి,  హైదరాబాద్‌: బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం సాయంత్రం నగరంలో హైఅలెర్ట్‌ ప్రకటించారు.  స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులను అప్రమత్తం చేశామని.. కీలక ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బెంగళూరు కేఫ్‌ పేలుడు కారణాల గురించి ఆరా తీస్తున్నామని చెప్పారాయన. 

జూబ్లీ బస్టాండ్‌, ఎంజీబీఎస్తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్‌లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వెహికిల్స్‌ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం మధ్యాహ్నాం బెంగళూరులోని కుండలహళ్లిలోని ఫేమస్‌ రామేశ్వరం కేఫ్‌ వద్ద టిఫిన్‌ బాక్స్‌ బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్‌ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఐఈడీతో దాడి జరిపారని.. పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారాయన. 

ఇదీ చదవండి: బెంగళూర్‌ కేఫ్‌లో పేలిన టిఫిన్‌ బాక్స్‌ బాంబ్‌

Advertisement

What’s your opinion

Advertisement