Best Pickle Recipes: How To Make Lemon Instant Pickle Recipe In Telugu, Step By Step Process - Sakshi
Sakshi News home page

Instant Lemon Pickle Recipe: టిఫిన్స్‌లోకి నిమ్మకాయ ఇన్‌స్టంట్‌ పచ్చడి.. ఇలా చేసుకోండి

Published Mon, Aug 21 2023 2:39 PM

How To Make Lemon Instant Pickle Recipe In Telugu - Sakshi

ఉల్లి, పల్లి, కొబ్బరి, వెల్లుల్లి, పుట్నాల పచ్చళ్లు తినితిని చప్పగా మారిన నాలుకకు ఊరించే చట్నీలు కనిపిస్తే ప్రాణం లేచివస్తుంది. అందుకే చూడగానే నోరూరించే చట్నీలతో ఈ వారం వంటిల్లు మీకోసం...

నిమ్మకాయ ఇన్‌స్టంట్‌ పచ్చడి తయారికి కావల్సినవి:

నిమ్మకాయలు – పది; బెల్లం – అరకప్పు; జీలకర్ర – నాలుగు టీస్పూన్లు;
ఎండు మిర్చి – ఇరవై; ఉప్పు – రుచికి సరిపడా.

తయారీ విధానమిలా:
నిమ్మకాయలను నాలుగు ముక్కలుగా కట్‌ చేయాలి.ముక్కల్లో ఉన్న గింజలన్నింటినీ తీసేయాలి (గింజలు ఉంటే పచ్చడి చేదుగా వస్తుంది).
► నిమ్మకాయ ముక్కలు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా పేస్టుచేయాలి 
► ఎండు మిర్చి, బెల్లంను కలిపి పొడిచేయాలి ∙ఇప్పుడు నిమ్మకాయ పేస్టులో ఎండుమిర్చి పొడి, రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి.
► తాలింపు కావాలంటే వేసుకోవచ్చు. తాలింపు లేకపోయినా బావుంటుంది.
► ఈ చట్నీని వెంటనే కూడా తినవచ్చు. కానీ రెండుమూడు రోజులు మాగాక మరింత రుచిగా ఉంటుంది.
► ఇడ్లీ,దోశ, పరాటా, చపాతీ, అన్నంలోకి ఈ చట్నీ చాలా బావుంటుంది.

Advertisement
Advertisement