సగ్గుబియ్యం టిక్కీ.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు | Saggubiyyam Recipes: How To Make Sabudana Tikki Recipe In Telugu, Making Process Inside - Sakshi
Sakshi News home page

Saggubiyyam Cutlet Recipe: సగ్గుబియ్యం టిక్కీ.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు

Published Fri, Oct 13 2023 11:16 AM

How To Make Sabudana Tikki Recipe In Telugu - Sakshi

సగ్గుబియ్యం టిక్కీ తయారీకి కావలసినవి:
సగ్గుబియ్యం – కప్పు; వేయించిన పల్లీలు – కప్పు; బంగాళ దుంపలు – రెండు;
అల్లం – రెండు అంగుళాల ముక్క; పచ్చిమిర్చి – రెండు; జీలకర్ర – టీస్పూను;
కొత్తిమీర తరుగు – పావు కప్పు; నిమ్మకాయ – అరచెక్క; ఉప్పు – రుచికి సరిపడా.
 

తయారీ విధానమిలా:

  • సగ్గుబియ్యాన్ని దోరగా వేయించి, చల్లారాక పొడిచేసి పెట్టుకోవాలి ∙పల్లీలను బరకగా గ్రైండ్‌ చేసి సగ్గుబియ్యం పొడిలో కలపాలి.
  • బంగాళ దుంపలను తొక్కతీసి ముక్కలుగా తరగాలి. ∙పచ్చిమిర్చి, అల్లం కూడా ముక్కలుగా తరగాలి.
  • ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర తరుగు వేసి గ్రైండ్‌ చేయాలి.
  • నలిగిన మిశ్రమాన్నీ, సగ్గుబియ్యం పొడిలో వేసి, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మచెక్కను పిండి రసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • పదిహేను నిమిషాల తరువాత పిండిని టిక్కీల ఆకారంలో వత్తుకుని డీప్‌ఫ్రై చేస్తే సగ్గుబియ్యం టిక్కీలు రెడీ ∙కొత్తిమీర చట్నీతో ఈ టిక్కీలు చాలా రుచిగా ఉంటాయి. 

సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి

Advertisement
Advertisement