బేకరీ స్టైల్‌లో కుకీస్‌.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు | Sakshi
Sakshi News home page

క్రిస్టమస్‌ గెస్ట్‌ల కోసం ప్రత్యేకంగా..స్నీకర్‌ డూడుల్‌ కుకీస్‌

Published Wed, Dec 20 2023 3:09 PM

How To Make Snickersdoodle Cookies Recipe At Home - Sakshi

స్నీకర్‌ డూడుల్‌ కుకీస్‌ తయారీకి కావల్సినవి:

మైదా – మూడు కప్పులు; టార్టారిక్‌ యాసిడ్‌ – రెండు టీస్పూన్లు;
కోషర్‌ సాల్ట్‌ – టీస్పూను; వంటసోడా – ముప్పావు టీస్పూను;
బటర్‌ –కప్పు; పంచదార – ఒకటిన్నర కప్పులు;
వెనీలా ఎసెన్స్‌– టీస్పూను; దాల్చినచెక్క పొడి – టేబుల్‌ స్పూను

తయారీ విధానమిలా:
పెద్దగిన్నెలో మైదా, టార్టారిక్‌ యాసిడ్, వంటసోడా వేసి కలపాలి ∙అన్నీ కలిసిన తరువాత బటర్, ఒకటింబావు కప్పుల పంచదార వేసి మెషిన్‌ మిక్సర్‌తో కలపాలి ∙మిశ్రమం క్రీమ్‌లా మారిన తరువాత వెనీలా ఎసెన్స్‌ వేసి కలిపి రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి ∙మిగిలిన పంచదారలో దాల్చినచెక్క పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ∙గంట తర్వాత రిఫ్రిజిరేటర్‌నుంచి తీసిన మిశ్రమాన్ని రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున తీసుకుని బాల్స్‌లా చేసి దాల్చినచెక్క పొడి అద్ది బేకింగ్‌ ట్రేలో పెట్టాలి ∙కుకీస్‌ అన్నీ తయారయ్యాక.. బేకింగ్‌ ట్రేని 350 డిగ్రీల ఫారిన్‌ హీట్స్‌ వద్ద, ఇరవై నిమిషాలు బేక్‌ చేస్తే స్నీకర్‌ డూడుల్‌ కుకీస్‌ రెడీ.

Advertisement
Advertisement