అపార్ట్‌మెంట్‌ విండోలో భారీ కొండచిలువ..చూస్తే హడలిపోతారు!

27 Sep, 2023 13:30 IST|Sakshi

ఇళ్లలోకి కొడచిలువలు రావడం అనేది ఆస్ట్రేలియాలోనే ఎక్కువగా జరుగతుంది. అక్కడ గ్రామాలు, పట్టణాల్లోని అపార్టమెంట్‌లోకి కూడా కొండ చిలువలు వస్తాయి. ఎందుకంటే ఈ కొడచిలువలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంటారు. దీంతో పొరపాటున జొరబడటం లేదా అటాక్‌ చేయడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘటన తొలిసారిగా భారత్‌లో చోటు చేసుకుంది. భారత్‌లో గ్రామాల్లోని ఇళ్ల మద్య కొండచిలువ కనపడటం అరుదు. అందులోనూ అపార్టమెంట్‌లోకి చొరబడటం అనేది అస్సలు జరగుదు. అలాంటిది భారత్‌లోనే ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ అరుదైన ఘటన జరగడం అదర్నీ ఆశ్చర్యపరిచింది.

వివరాల్లోకెళ్తే.ఈ అనూహ్య ఘటన మహారాష్ట్రాలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భవనంలోని అపార్టమెంట్‌ విండోలోకి భారీ కొండచిలువ చొరబడింది. పాపం అది ఆ విండోకి ఉండే గ్రిల్స్‌ మధ్య ఇరుక్కుపోయింది. దీంతో ఇద్దరు వ్యక్తులు రంగంలోకి దిగిన దాన్ని రక్షించే యత్నం చేశారు. ఒకరు కిటికిలోంచి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయగా మరొకరు కిటికి బయటకు వచ్చి దాన్ని ఆ గ్రిల్‌ నుంచి విడిపించే యత్నం చేశారు. ఐతే చివరికి ఆ కొండచిలువ ఆప్రయత్రంలో అంత ఎత్తున్న ఉన్న అపార్ట్‌మెంట్‌ నుంచి కిందకు పడిపోయింది.

అయితే ఆ తర్వాత ఆ కొండచిలువ అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ పామును రక్షించే యత్నం చేసిన ఆ వ్యక్తులను ప్రశంసిస్తున్నారు కానీ ఆ భారీ కొండచిలువ అంత ఎత్తు నుంచి పడిపోయింది కాబట్టి ఎన్నో రోజులు అది బతకదు అంటూ ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరూ అస్సలు అది ఎలా అపార్ట్‌మెంట్‌లోకి చొరబడిందని ప్రశ్నిస్తూ మరొకరు కామెంట్లు చేస్తూ ట్వీట్లు పెట్టారు. 

(చదవండి: కొత్తగా.. ఎనిమిదో ఖండం! 375 ఏళ్లుగా !..వెలుగులోకి షాకింగ్‌ విషయాలు)

మరిన్ని వార్తలు