సమ్మర్‌ : ఈ జాగ్రత్తలు మర్చిపోతున్నారా? | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ : ఈ జాగ్రత్తలు మర్చిపోతున్నారా?

Published Mon, Apr 1 2024 4:57 PM

Summer foods and fruits that keep you cool check details here - Sakshi

ఏ‍ప్రిల్‌ మాసంలోకి ఎంటరై పోయాం. మండే ఎండలకు సిద్ధం కావాలి.  రాబోయే రోజుల్లో  వేసవి తాపం గురించి వాతావరణ నిపుణులు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే హెచ్చరించారు. ఈ  నేపథ్యంలో వసవిలోత  తాపానికి తట్టుకొని నిలబడే ఆహారాన్ని తీసుకుంటూ,దానికి తగినట్టుగా  జీవన శైలిని మార్చుకోవాలి.

ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేలా, బాడీ చల్లగా ఉండేలా చూసుకోవాలి.  ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్‌ బారిన పడకుండా కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. వేసవిలో మాంసాహారాన్ని తగ్గించుకుంటే మంచింది.  దీనికి బదులుగా తేలికగా  జీర్ణమయ్యే తాజా కూరగాయలను ఎక్కువగా తినాలి.

తాజా కూరలు, పళ్లు
కూరగాయల్లో అన్ని రకాల ఆకు కూరలతోపాటు, దోసకాయ, కీరా, బీరకాయ, గుమ్మడి, టమాటా, బెండ, లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి.  ఇక ఫ్రూట్స్‌లో పుచ్చకాయ, జామ, పైనాపిల్‌, దానిమ్మ, ఇతర సిట్రస్ పండ్లు కొవ్వు పదార్ధాలను విచ్ఛిన్నం చేస్తాయి, జీర్ణక్రియకు సహాయ పడతాయి. అలాగే బాడీకి చల్లదనాన్నిస్తాయి. 
నిమ్మ, పుదీనా - చల్లదానికి నిమ్మ పుదీనా చాలా మంచిది. ఈరెండూ  కలిస్తే ఏ పానీయమైనా  రిఫ్రెష్‌ అయిపోతుంది. 
కొబ్బరి నీళ్ళు,మజ్జిగ : వేసవిలో ఎంత నీరు తాగితే అంత మంచిది. కొబ్బరి నీళ్లు సహజ ఎలక్ట్రోలైట్‌లతో నిండి ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ప్రత్యేకించి ఎండకు బాగా  అలసిపోయినప్పుడు బాగా  పనిచేస్తుంది.
ఉల్లిపాయలు - ఉల్లిపాయలు చలవగా చాగాబాగా పని చేస్తాయి. వడదెబ్బ నుంచి ఉల్లిపాయలు కాపాడతాయని ఆయుర్వేదం చెబుతోంది.  అందుకే దీన్ని పచ్చిగా, రైతా, సలాడ్‌లు , చట్నీలలో  వాడుకోవచ్చు.

వేడిని పెంచే కొన్ని ఆహార పదార్థాలు 
వేరుశెనగ , క్యారెట్లు, గుడ్లు, మాంసాహారం లాంటి వాటిల్లో పోషకాలు అధికం కాబట్టి జీర్ణం కావడం లేటవుతుంది. వీటికి శరీరంలో వేడిని పెంచే శక్తి ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అల్లం, వెల్లుల్లి, ఇతర మసారా దినుసులను బాగా తగ్గించాలి.  యాంటీ ఆక్సిడెంట్లులో పుష్కలంగా ఉండే అల్లం, వెల్లుల్లి, శరీరంలో వేడిని పెంచుతాయి. గుండెమంట, అజీర్తి, గ్యాస్‌ లాంటి సమస్యలున్నవారు  ఈ వేసవిలో జాగ్రత్తగా ఉంటే బెటర్‌.  వేసవి వచ్చింది కదా అని పచ్చళ్లు తెగ తినేయకూడదు.  కొత్త ఆవకాయ లాంటి పచ్చళ్లను మితంగా తీసుకోవాలి.

ఇతర జాగ్రత్తలు
మరీ అవసరం అయితే  ఎండకు వెళ్లకుండా ఉండాలి.  ఉదయం 12 తరువాత బయటికి  వెళ్లవద్దు. సాయంత్రం పనులను 4 గంటల తరువాత ప్లాన్‌ చేసుకోవాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. గొడుగు, స్కార్ఫ్‌, తలపై కప్పుకోవాలి. లేదా టోపీ  పెట్టుకోవాలి. వ్యాయామం  చేసే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి.

వెంట నీళ్ల బాటిల్‌ తీసుకుపోవాలి.  ఒకవేళ  ఎండకు వెళ్లి వచ్చిన తరువాత బాగా నలతగా, అలసటా అనిపించినా అప్రమత్తం కావాలి. తలనొప్పి, వాంతులు, విరోచనాలు లాంటి సమస్యలొస్తే.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలు, పెద్దల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

Advertisement
Advertisement