Health Benefits Of Kothimeera: కొత్తిమీర చట్నీ, నిల్వ పచ్చడి తింటున్నారా.. ఇందులోని ‘డుడిసినాల్‌’ వల్ల.. రసంతో తేనె కలిపి తాగితే

12 Feb, 2022 11:25 IST|Sakshi

కొత్తిమీరతో అమితమైన ప్రయోజనాలు

Top 11 Amazing Health Benefits Of Coriander Kothimeera In Telugu: కొత్తిమీర మంచి సువాసన కలిగి ఉంటుంది. వంటకాలలో విరివిగా వాడతారు. తెలుగు వారు దాదాపు ప్రతి కూరలో దీనిని వేస్తారు. అంతేకాక కొత్తిమీరతో ఇన్‌స్టంట్‌ చట్నీ చేస్తారు. నిల్వ పచ్చడి కూడా పెడతారు. కొత్తిమీరను ఆహార పదార్దాల మీద అందంగా గార్నిష్‌ చేయడానికి మాత్రమే వాడతారని భావిస్తే పొరపాటే.

కొత్తిమీరలో విటమిన్లు, ఖనిజ లవణాలు, ఐరన్‌ సమృద్ధిగా లభిస్తాయి కాబట్టి మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరల వంటకాలలో కొత్తిమీరను కూడా విధిగా వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో చూద్దాం....

​కొత్తిమీర తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
రక్తహీనతను తగ్గిస్తుంది.
ధూమపానం, కీమోథెరపీ వల్ల తలెత్తే దుష్ఫలితాలను తగ్గించడానికి దోహదం చేస్తుంది. 
కొవ్వుతో పోరాడుతుంది. 
రక్తనాళాలలో ఏర్పడిన ఆటంకాలను తొలగిస్తుంది
కొత్తిమీర ఫుడ్‌ పాయిజనింగ్‌కు చేసే చికిత్సలో అత్యంత ప్రయోజనకారిగా పనిచేస్తుందని కొన్ని అధ్యయాల ద్వారా తెలిసింది.
తాజాగా సేకరించిన కొత్తిమీరలో డుడిసినాల్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆహారాన్ని విషతుల్యం చేసే సాల్మనెల్లా బ్యాక్టీరియాని నిర్వీర్యపరుస్తుందని గమనించారు. 
నోటి పూత, నోటి దుర్వాసన, చిగుళ్లవాపు, చిగుళ్లనుంచి రక్తం కారటం వంటి సమస్యలకు శుభ్రంగా కడిగిన కొత్తిమీర ఆకులను నమిలి మింగుతుంటే ఉపశమనం కలుగుతుంది. 

మేని మెరుపు కోసం కూడా..
పెదవులు నల్లగా ఉన్నవారు రోజూ రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసం పెదవులపై రాయండి.కొన్ని రోజులకి పెదాలు లేత రంగును సంతరించుకొంటాయి. 
మొటిమలు, మంగు మచ్చలు చర్మంమీద నల్లని మచ్చలు, పొడి చర్మం, పెద్దసైజు మొటిమలు వంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు చెంచాడు కొత్తిమీర రసానికి చిటికెడు పసుపు చేర్చి కలిపి ముఖానికి పూసి, ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనికి ముందు ముఖాన్ని బాగా శుభ్రపరుచుకోవటం అవసరం. దీనిని ప్రతిరోజూ రాత్రి నిద్రకుముందు ప్రయోగిస్తే కొద్దిరోజుల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది. 
విటమిన్‌–ఏ, విటమిన్‌–బి1, విటమిన్‌–బి6, విటమిన్‌–సి విటమిన్ల లోపం తలెత్తకుండా ఉండాలంటే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు తాజాగా తీసిన కొత్తిమీర రసానికి చెంచాడు తేనె కలుపుకొని తాగుతుండాలి. 

చదవండి: Health Benefits Of Kismiss: నానబెట్టిన కిస్‌మిస్‌లు తరచూ తింటున్నారా... ఆ సమస్యలు ఉంటే!

మరిన్ని వార్తలు