Sakshi News home page

Snakes On Plate: కొండచిలువలు తినడం మంచిదంటున్న శాస్త్రవేత్తలు! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు

Published Fri, Mar 15 2024 4:49 PM

Why Scientists Want You To Eat More Pythons - Sakshi

ఇంతవరకు మాంసాన్ని ల్యాబ్‌లో తయారు చేయడం వంటి వాటి గురించి కథనాలు విన్నాం. దీని వల్ల శాకాహారులకు కూడా మేలు జరుగుతుంది. వారికి కావాల్సిన పోట్రీన్లు ఇలా కృత్రిమంగా తయారు చేసిన మాంసం ద్వారా అందుతుందని భావించారు కూడా. అవన్నీ పరిశోధన దశల్లో ఉన్నాయి. ఇప్పుడు అది ఇది కాదంటూ ఏకంగా కొండచిలువలనే ఆహారంగా తినమని చెబుతున్నారు. పైగా ఆరోగ్యానికి మంచిదంటూ షాకింగ్‌ విషయాలు చెబుతున్నారు. ఎందుకిలా అన్నారంటే..

ఇంతవరకు మనుషులు మేకలు, గొర్రెలు, కోళ్లు వంటి ఇతరత్ర మాంసాలను తినేవారు. అయితే వీటి వల్ల కేవలం వంద గ్రాములు ప్రోటీన్‌ మాత్రమే ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే వీటి కారణంగా గాలిలో 49.89 కిలోగ్రాముల కార్బన్‌డయాక్స్‌డ్‌ విడుదలవుతుందని పరిశోధనల్లో తేలిందన్నారు. అందువల్ల మాంసాహారం ఎక్కువుగా తినడమనేది పర్యావరణాని హానికరమని నొక్కి చెబుతున్నారు పరిశోధకులు. వీటికి బదులు కొండచిలువలు తినడం చాలా మంచిదని, ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు.

ఈ మేరకు తాము ఒక పొలంలో దాదాపు 12 నెలలపాటు పెంచిన రెండు కొండచిలువలపై జరిపిన అధ్యయనంలో తేలిందని సరీసృపాల నిపుణుడు డాక్టర్ డేనియల్ నాటుష్ చెబుతున్నారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ పలు షాకింగ్‌ విషయాలు చెప్పుకొచ్చారు. ఇవి నీరు లేకుండా దాదాపు నెలరోజులు జీవిస్తాయట. వీటి పొలుసుల మీద ఉండే నీటితోనే అన్ని రోజుల పాటు నీరు తీసుకోకుండా బతకగలవని అన్నారు. అలాగే దాదాపు ఒక సంవత్సరం పాటు ఏం తినకుండానే బతికేస్తాయట. అలాగే పంట బాగా పండటంలో వీటి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అన్నారు. 

అలాగే ఇవి తక్కువ గ్రీన్‌హౌస్‌ వాయువులను ఉత్పత్తి చేస్తాయని అన్నారు. ఇవి తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండగలవు, పైగా బ్లర్డ్‌ ఫ్లూ లేదా కోవిడ్‌ -19 వంటి వ్యాధులను వ్యాప్తి చేయవని అధ్యయనంలో వెల్లడయ్యిందని తెలిపారు. ఈ ఆసక్తికర పరిశోధన సైంటిఫిక్‌ రిసెర్చ్‌ ప్రచురితమయ్యింది. అలాగే వీటిని ఆహారంగా తీసుకుంటే మంచి ప్రోటీన్‌ పుష్కలంగా అందుతుందని అన్నారు. ఒక ఏడాదిపాటు సాగిన ఈ పరిశోధనలో తాము ఈ కొండచిలువలకు ఎలుకలు, చేపలు వంటి వాటిని ఆహరంగా అందించి ఎప్పటికప్పుడూ వాటి బరువుని కొలిచే వాళ్లమని చెప్పారు.

అయితే ఈ రెండు పైథాన్‌లలో ఆడ కొండచిలువ వేగంగా బరువు పెరిగినట్లు పేర్కొన్నారు. వివి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కరువు ఏర్పడి పశువులు పెద్ద సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది. అలాంటి సమయాల్లో మాంసాహారంగా ఈ కొండచిలువలు ప్రత్యామ్నాయంగా ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తుల. వామ్మో కొండ చిలువ తినడమమా ఏందీ వింత పరిశోధన అని భావిస్తున్నారా?. టెన్షన్‌ పడొద్దు ఎందుకంటే..దీనిపై ఇంకా కూలంకషంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు పూర్తి అయ్యేతే గానీ కార్య రూపం దాల్చదు. అదీగాక కొండచిలువల పెంపకం అనే విషయంలో సాధ్యా సాధ్యాలు కూడ అంచాన వేయాల్సి ఉంటుంది. 

(చదవండి: 'కుమారీ ఆంటీ' లాంటీ ఇన్సిడెంట్‌..మరీ ఇదేమవుతుందో..!)

Advertisement

What’s your opinion

Advertisement