చీరకట్టులో జిమ్‌ వర్క్‌ఔట్స్‌!

11 Feb, 2024 10:34 IST|Sakshi

ఇటీవల కాలంలో చీర ధరించడాన్నే ట్రెండీగా ఫాలో అవుతోంది యువత. అందులోనూ చీర కట్టులో  స్కూటర్‌ నడపడం, లేదా వ్యాయామాలు చేసి  ఆశ్చర్యపరుస్తున్నారు. నెటింట కూడా అలాంటి వీడియోలకే మంచి ఆదరణ ఉందని చెప్పొచ్చు. అంతేగాదు చీర కట్టులో ఎలాంటి పనులైన సునాయాసంగా చెయ్యొచ్చని నిరూపిస్తున్నారు. ఇక్కడ కూడా ఓ ఫిటెనెస్‌ కోచ్‌ చీరకట్టులో వర్క్‌ఔట్‌లు చేసి అందర్నీ ఆకర్షించింది. 

శారీ వర్కవుట్‌ వీడియోలతో ఇంటర్నెట్‌లో ఫేమ్‌ అయింది ఫిట్‌నెస్‌ కోచ్‌ రీనాసింగ్‌. చీరకట్టుతో ఫుష్‌–అప్స్, పుల్‌–అప్స్, స్వ్కాట్స్, జంప్స్‌లాంటి ఎక్సర్‌సైజులు చేస్తూ నెటిజనులను ఆకట్టుకొంటుంది. పాత, కొత్తా అనే తేడా లేకుండా ఆమె వీడియోలు వైరల్‌ అవుతూనే ఉంటాయి. రీనాసింగ్‌ తాజా వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో  21.3 మిలియన్‌ల వ్యూస్‌ను సాధించింది. 

‘వర్కవుట్‌ల సమయంలో సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలని సిఫారసు చేసినప్పటికీ సౌకర్యంగా అనిపిస్తే చీర ధరించి వ్యాయామాలు చేయడం పొరపాటేమీ  కాదు. అయితే గ్రిప్‌ తప్పకుండా ఉండడానికి అవసరమైన ఫుట్‌వేర్‌ ధరించాలి’ అంటుంది యోగా ట్రైనర్‌ అనూష రామ్‌. 

A post shared by Reena Singh (@reenasinghfitness)

(చదవండి: మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే..!)

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega