Sakshi News home page

‘సైకిల్‌’ దొంగ దొరికాడోచ్‌!

Published Fri, Mar 29 2024 2:15 AM

- - Sakshi

ఎన్నికలవేళ టీడీపీ తాయిలాలు!

పొన్నూరు అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఫొటో స్టిక్కర్లతో భారీగా సైకిళ్లు

స్వాధీనం చేసుకున్న అధికారులు

ఓటర్లకు పంపిణీ చేసేందుకు ధూళిపాళ్ల స్వగ్రామంలో దాచినట్టు నిర్ధారణ?

గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, తాయిలాల ఎరవేసి ఓట్లు దక్కించుకునేందుకు టీడీపీ పన్నాగం పన్నింది. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసి తల్లిదండ్రుల మెప్పుపొందేందుకు భారీ సంఖ్యలో సైకిళ్లను కొనుగోలు చేసింది. టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల స్వగ్రామం చింతలపూడిలోని ఓ రైస్‌మిల్లులో నిల్వ చేశారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు వాటిని సీజ్‌ చేశారు. శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు పొన్నూరు నియోజకవర్గం ఎన్నికల అధికారులకు ఫోన్‌ చేశారు.

మండలంలోని చింతలపూడి గ్రామంలోని ఓ రైస్‌మిల్‌లో టీడీపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఫొటో, సైకిల్‌ గుర్తుతో ఉన్న నూతన సైకిళ్లు వందల సంఖ్యలో ఉన్నాయని సమాచారం అందింది. వెంటనే అధికారులు హుటాహుటిన రైస్‌మిల్‌కు చేరుకుని వందల సంఖ్యలో ఉన్న సైకిళ్లను చూసి అవాక్కయ్యారు. అన్ని సైకిళ్లకు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ రంగు, గుర్తులు, అభ్యర్థి ఫొటో ఉండటంతో అన్ని సైకిళ్లను సీజ్‌ చేశారు. సంఘటనా స్థలానికి ఓ వ్యక్తి చేరుకుని తాను కోర్టు ద్వారా ఆక్షన్‌లో సైకిళ్లను దక్కించుకున్నానని, అధికారులకు తెలిపాడు.

అయితే ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా సైకిళ్లు ఉన్నాయని, ఒకేచోట పార్టీ సింబల్స్‌తో ఇన్ని సైకిళ్లు ఉండరాదని తేల్చిచెప్పారు. కోడ్‌ ఉల్లంఘించిన కారణంగా 567 సైకిళ్లను సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు ఫ్‌లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారి వరదరాజులు, ఏంపీడీవో రత్నజ్యోతి తెలిపారు. ధూళిపాళ్ల నరేంద్ర ఎన్నికల తాయిలాల పంపకంతోనే విజయం సాధించే ప్రక్రియకు ఎన్నికల అధికారులు అడ్డుకట్ట వేశారు.

ఇవి చదవండి: ‘ఆమ్‌ ఆద్మీ’ని అంతం చేసే కుట్ర

Advertisement

What’s your opinion

Advertisement