Sakshi News home page

No Headline

Published Tue, Dec 26 2023 5:06 AM

-

సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించనున్న ‘ప్రజాపాలన’ కార్యక్రమానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానకిశోర్‌ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌తో కలిసి జీహెచ్‌ఎంసీ ప్రజాపాలన అమలుకు నియమించిన సర్కిల్‌ ప్రత్యేక అధికారులు, జోనల్‌ కమిషనర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దానకిషోర్‌ మాట్లాడుతూ.. అర్హులు 6 గ్యారంటీ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు వార్డుల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లకు వచ్చి వినతులను అందించేందుకు షెడ్యూల్డ్‌ సమాచారాన్ని తప్పనిసరిగా వారికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం కోసం జీహెచ్‌ఎంసీలో చేసిన ఏర్పాట్లను రోనాల్డ్‌రాస్‌ ఆయనకు వివరించారు. ప్రతివార్డులో నాలుగు లొకేషన్లలో.. ఒక్కో లొకేషన్‌లో 3 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు ఎక్కువగా ఉన్న పక్షంలో అదనంగా మరికొన్ని కౌంటర్లు అవసరమైన మేరకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం జీహెచ్‌ఎంసీ పరిధిలో 600 లోకేషన్స్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు, అందుకు 5 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరో 5 వేల మంది వలంటీర్లను నియమించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రజాపాలన కార్యక్రమం డిసెంబర్‌ 31, జనవరి 1వ తేదీల్లో మినహా మిగతా రోజుల్లో నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా కమిషనర్‌ వివరించారు. సమీక్ష సమావేశంలో హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, ఇతర శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement