శరీరంపై 800 టాటూలు.. అక్కడే చిక్కొచ్చి పడింది..!

6 Jul, 2023 11:20 IST|Sakshi

టాటూ.. శరీరాన్ని మరింత అందంగా ఫ్యాషన్‌గా కనిపించేలా చేస్తుంది. అందరి కళ్లూ మనమీదే ఉండేలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ మహిళకు మాత్రం టాటూలే తన పాలిట శాపంగా మారాయి. టాటూల కారణంగానే ఎక్కడకు వెళ్లినా.. దిక్కరింపులే ఎదురవుతున్నాయట. జీవనోపాధి కూడా లభించట్లేదట. ఎందుకంటే..?

ఆమె పేరు మెలిస్సా స్లోన్(46) యూకేకు చెందిన మహిళ. ఇంతకు ముందు తనకు కనీసం టాయిలెట్ క్లీనింగ్ ఉద్యోగమైనా లభించేది. కానీ ఇప్పుడు అది కూడా దొరకట్లేదు. ఎందుకంటే ఆమె తన శరీరంపై ఏకంగా 800 టాటూలను వేయించుకుంది. శరీరమంతా టాటూలతో నిండిపోయింది. దీంతో ఎక్కడకు వెళ్లినా ఉద్యోగం ఇవ్వకుండా యజమానులు తిరస్కరిస్తున్నారట. 

మెలిస్సాకు తన 20వ ఏట నుంచి టాటూలను శరీరంపై వేయించుకునే అలవాటు ఉండేది.  మొదట్లో ప్రతి వారం రెండు నుంచి మూడు టూటూలు వేయించుకుంటే.. ఇక రాను రాను పరిస్థితి మారిపోయింది. వాటికి అలవాటు పడి శరీరమంతా పచ్చబొట్లను పొడిపించుకుంది. దీంతో చూడటానికి ఇబ్బందికరంగా మారిపోయింది. 

మెలిస్సాకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. టూటూల కారణంగా శరీరం నీలం రంగులో మారిపోయిందని ఆమె చెబుతున్నారు. కానీ అవంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతోంది. బహుశా ప్రపంచంలో తన కంటే ఎక్కువ టాటూలు ఎవరి శరీరంపై ఉండబోవని ఆమె అన్నారు.

ఇదీ చదవండి: గిన్నీస్ రికార్డ్‌: చేతులపై 25 సెకన్లలో 75 మెట్లు దిగి..

మరిన్ని వార్తలు