Sakshi News home page

విద్యుత్‌ షాక్‌ నుంచి అమ్మాయిని కాపాడిన ఆర్టిఫిషియల్‌ గోళ్లు

Published Sun, Jul 30 2023 11:12 AM

fake nails saved life when electric shock - Sakshi

సాధారణంగా విద్యుత్‌ షాక్‌ తగిలినవారు తీవ్రంగా గాయాలపాలు కావడమో లేదా మృతి చెందడమో జరుగుతుండటాన్ని మనం చూసేవుంటాం. అయితే ఇటీవల ఒక కాలేజీ యువతికి విద్యుత్‌ షాక్‌ తగిలి 4 అడుగుల దూరం ఎగిరిపడంది. అయితే ఇంత జరిగినా ఆమెకు చిన్నపాటి గాయం కూడా కాకపోవడం విశేషం.

ఈ విచిత్ర ఉదంతం ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. తనకు ఎదురైన అనుభవం గురించి బాధితురాలు మాట్లాడుతూ తాను నకిలీ గోళ్లు పెట్టుకున్నకారణంగా విద్యుత్‌ షాక్‌ నుంచి  బయటపడ్డానని తెలిపింది.  21 ఏళ్ల నికోల్‌ ఫోర్‌మ్యాన్‌ అనే యువతి ఇంటిలోని బాయిలర్‌ సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్‌ షాక్‌కు గురయ్యింది. బాయిలర్‌ను బంద్‌ చేయకుండానే నీటిని వేడి చేసి, స్నానం చేసేందుకు ఆ నీటిలో కాలు మోపింది. వెంటనే ఆమె షాక్‌నకు గురయ్యింది. 

ఎడిన్‌బర్గ్‌ క్వీన్‌ మార్గరిట్‌ యూనివర్శిటీలో చదువుకుంటున్న ఆ యువతి..‘షాక్‌ తగిలిన వెంటనే నాలుగు అడుగుల దూరం ఎగిరిపడ్డాను. తరువాత స్పృహ కోల్పోయానని’ తెలిపింది. ఇంటిలోని వారు ఆమెను గమనించి వెంటనే బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి, ఆమె పెట్టుకున్న నకిలీ గోళ్ల కారణంగానే ఎంతో ప్రమాదకరమైన విద్యుత్‌ షాక్‌ నుంచి బయటపడిందని తెలిపారు. 

ప్రమాదం నుంచి బయటపడిన నికోల్‌..‘మా అమ్మ నా ఆర్టిఫిషిల్‌ గోళ్లను చూసి నన్ను తెగ మందలించేది. అయితే ఇప్పుడు ఆ గోళ్లే తనను కాపాడాయని తెలుసుకుని సంతోషపడుతోందని’ తెలిపింది. 
ఇది కూడా చదవండి: భూమిపై ఎలియన్స్‌?.. ప్రకంపనలు పుట్టిస్తున్న నిఘా విభాగం మాజీ అధికారి వాదన!

Advertisement

What’s your opinion

Advertisement