Sakshi News home page

వెస్ట్‌బ్యాంక్‌లో ముగిసిన సైనిక ఆపరేషన్‌

Published Thu, Jul 6 2023 5:57 AM

Israel ends deadly raid in West Bank Palestinian refugee camp - Sakshi

వెస్ట్‌బ్యాంక్‌
మిలిటెంట్లను ఏరివేయడమే లక్ష్యంగా వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ సైన్యం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌ బుధవారం ముగిసింది. ఇజ్రాయెల్‌ బలగాలను వెనక్కి వెళ్లిపోయాయి. సోమవారం, మంగళవారం జరిగిన దాడుల్లో 12 మంది పాలస్తీనావాసులు, ఒక ఇజ్రాయెలీ జవాను మృతిచెందారు. తాము నిర్వహించిన డ్రోన్‌ దాడుల్లో చనిపోయినవారంతా మిలిటెంట్లేనని ఇజ్రాయెల్‌ సైన్యం చెబుతోంది.

జెనిన్‌ శరణార్థుల శిబిరంలో భయం ఇంకా తొలగిపోలేదు. జనం ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. వీధులను శుభ్రం చేసుకుంటున్నారు. దుకాణాలు తెరుచుకుంటున్నారు. ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు క్రమంగా తిరిగివస్తున్నారు. క్యాంప్‌లో ఎక్కడ చూసినా భీతావహ వాతావరణం కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. తాగునీరు, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

ఇంకా పునరుద్ధరించలేదు. ఇంటర్నెట్‌ సేవలు సైతం ఆగిపోయాయి. డ్రోన్‌ దాడ్రుల్లో మిలిటెంట్‌ ముఠాలకు భారీగా నష్టం వాటిల్లిందని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. వెస్ట్‌బ్యాంక్‌ నుంచి ఉగ్రవాదులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి సైనిక ఆపరేషన్లు పునరావృతం కావడం తథ్యమని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ హెచ్చరించారు. జెనిన్‌ శివారులోని ఓ సైనిక స్థావరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. 

Advertisement

What’s your opinion

Advertisement