Sakshi News home page

Research: భారతదేశం రెండు ముక్కలు కానుందా?

Published Wed, Feb 28 2024 11:37 AM

Researchers have discovered that a portion of the Indian Plate is  delaminating - Sakshi

హిమాలయ పర్వత శ్రేణికి దిగువన భారత, యురేషియా ఖండాంతర టెక్టోనిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొంటున్న కారణంగా హిమాలయాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించారు. అయితే ఇండియన్ ప్లేట్‌లోని కొంత భాగం యురేషియన్ ప్లేట్ కింద జారిపోతున్నందున అది ‘డీలామినేట్’ అవుతున్నదని పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. ఈ ప్రక్రియ భారత్‌ను బౌగోళికంగా విభజించే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సాధారణంగా రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు, ఒకదాని కిందకు మరొకటి కిందకి జారిపోతుంది. ఈ ప్రక్రియను సబ్‌డక్షన్ అంటారు. రెండు ఖండాంతర పలకలు సమానంగా ఉన్నందున, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలకు ఏ ప్లేట్ మరొకదానిపై అతివ్యాప్తి చెందుతుందో ఖచ్చితంగా గుర్తించలేరు. ఇండియన్ ప్లేట్‌లోని దట్టమైన దిగువ భాగం పై భాగానికి దూరంగా ఉంటుంది. వీటిమధ్య నిలువుగా ఏర్పడిన పగులును శాస్త్రవేత్తలు గుర్తించారు. 

భారత- యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య  60 మిలియన్ సంవత్సరాలకు పైగా జరుగుతున్న ఘర్షణ హిమాలయాలకు ఇప్పుడు మనం చూస్తున్న ఆకృతినిచ్చింది. సముద్రపు పలకల వలె కాకుండా, ఖండాంతర పలకలు మందంగా, తేలికగా ఉంటాయి, అవి భూమిలోని మాంటిల్‌లోకి సులభంగా ఇమిడిపోవు.

భౌగోళిక భౌతిక శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఇటీవల టిబెట్ భాభూగం కింది భూకంప తరంగాలను విశ్లేషించింది. ఈ నేపధ్యంలో యురేషియన్ ప్లేట్ దాని కింద జారిపోతున్నందున భారత ప్లేట్ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది. ఈ బృదం యురేషియన్ ప్లేట్ మధ్య సరిహద్దు వద్ద పగుళ్లను కూడా కనుగొంది. భూకంప తరంగాలు,  హీలియం వాయువులు ఉపరితలంపైకి  చొచ్చుకు రావడం ఈ డీలామినేషన్ ప్రక్రియకు సాక్ష్యంగా నిలుస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఈ నూతన పరిశోధనా ఫలితాలు మునుపటి పరికల్పనలను సవాలు చేస్తున్నాయి. భౌగోళిక ప్రక్రియలను మరింతగా గుర్తించేలా చేస్తున్నాయి. ఇన్నాళ్లూ పరిశోధకులు ఖండాలు ఏర్పడటం వెనుక ఇటువంటి ప్రక్రియ ఉంటుందనే దానిపై పరిశోధనలు సాగించలేదు. అయితే ఈ కొత్త అధ్యయనం మరిన్ని నూతన ఆవిష్కరణలకు నాంది పలకనుంది. ఈ పరిశోధన అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ వార్షిక సమావేశంలో సమర్పించారు.  ఇది హిమాలయాల ఆవిర్భావాన్ని మరింతగా అర్థం చేసుకోవడంలో సహాయపడనుంది.అలాగే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భూకంప ప్రమాదాలను పసిగట్టేందుకు సహాయకారిగానూ ఉండవచ్చు. 

Advertisement

What’s your opinion

Advertisement