Sakshi News home page

5,150 మందికి కంటి పరీక్షలు

Published Tue, Apr 4 2023 8:26 AM

- - Sakshi

కామారెడ్డి టౌన్‌: జిల్లాలో సోమవారం కంటి వెలుగులో 5,150 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 805 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 2,69,514 మందికి కంటి పరీక్షలు చేసి, 42,360 మందికి కంటి అద్దాలను అందజేశామని వైద్యాధికారులు తెలిపారు.

పీహెచ్‌సీని

పరిశీలించిన కేంద్రబృందం

నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సోమవారం కేంద్ర బృంద సభ్యులు డాక్టర్‌ సంతోష్‌ కడ్లే, డాక్టర్‌ రాజా రాం సందర్శించారు. నేషనల్‌ క్వాలిటీ అ స్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌(ఎన్‌క్వాస్‌)లో భాగంగా పీహెచ్‌సీ నిర్వహణ తీరును పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న సేవలను గురించి తెలుసుకున్నారు. ఆశవర్కర్లతో మాట్లాడి గ్రామాల్లో వారు అందించే సే వలను గురించి తెలుసుకున్నారు. ఎన్‌క్వాస్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్రబృందం పీహెచ్‌సీని సందర్శించిందని డిప్యూటీ డీఎంహెచ్‌వో శోభారాణి తెలిపారు. రెండురోజులపాటు పీహెచ్‌సీలో అందిస్తున్న సేవలను, పరిసరాలను వారు క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్‌, ఎన్‌క్వాస్‌ మేనేజర్‌ జరీనా, పీహెచ్‌సి సిబ్బంది రామారావు తదితరులు ఉన్నారు.

కలెక్టరేట్‌లో చలివేంద్రం ప్రారంభం

కామారెడ్డి క్రైం: కలెక్టరేట్‌లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం, అంబలి కేంద్రాలను కలెక్టర్‌ జితేష్‌ వి పాటి ల్‌ సోమవారం ప్రారంభించారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సాయిలు, రాజారాం, చక్రధర్‌, శ్రీనివాస్‌రెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం పరిశీలన

జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను సోమ వారం కలెక్టర్‌ పరిశీలించారు. గోదాంలో ఉన్న సీసీ టీవీల పనితీరు, రికార్డులను పరిశీలించారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, అధికారులు ఉన్నారు.

‘బలగం’ ప్రదర్శించిన ఎల్‌ఈడీ స్క్రీన్‌ స్వాధీనం

రాజంపేట: మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం రాత్రి ఎల్‌ఈడీ స్క్రీన్‌ ద్వారా బలగం సినిమాను ప్రదిర్శించారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారు లు ఆ గ్రామానికి బయలుదేరారు. ప్రదర్శన అనంతరం మండల కేంద్రానికి ఎల్‌ఈడీ స్క్రీన్‌ మెటీరియల్‌ను తీసుకుని వస్తున్న ఆటోను రాజంపేట శివారులో పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సోమవారం వదిలేసినట్లు తెలిసింది.

తెయూ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాల విడుదల

తెయూ(డిచ్‌పల్లి) : తెయూ పరిధిలోని డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను సోమవారం వీసీ రవీందర్‌ విడుదల చేశా రు. పరీక్ష ఫలితాల కోసం తెయూ వెబ్‌సైట్‌ www.telanganauniversity.ac.in లో సంప్రదించాలని కంట్రోలర్‌ అరుణ విద్యార్థులకు సూచించారు.

Advertisement

What’s your opinion

Advertisement