Sakshi News home page

కేపీఎస్‌సీ వద్ద నిరుద్యోగి నిరసన

Published Tue, Dec 5 2023 5:06 AM

వేణువును వాయిస్తున్న దృశ్యం   - Sakshi

యశవంతపుర: పరీక్ష రాసి రెండేళ్లు అవుతున్నా ఫలితాలు విడుదల చేయలేదని అభ్యర్థి ఒకరు కర్ణాటక పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (కేపీఎస్‌సీ) ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పేపర్లు చించివేసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా ఇంతవరకు ఫలితాలు రాలేదన్నారు. ఫలితాలు విడుదల చేయాలని ఆరు నెలలుగా కోరుతున్నా ఫలితం లేదని అఖిల కర్ణాటక విద్యార్థి పరిషత్‌ అధ్యక్షుడు కాంతకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

వీనుల విందుగా వేణు

వాద్య సంగీతం

చింతామణి: తాలూకాలోని శ్రీ క్షేత్ర యోగినారేయణ మఠం ఆవరణలో నాదసుధారస సాంస్కృతిక వేదిక నాదసుధారస వేదికపై విద్వాన్‌ పతంజలి బృందం కొళువు వాద్య సంగీతం వీనులవిందుగా సాగింది. విశ్వనాథన్‌, గోవర్దన్‌, ప్రశాంత్‌ సహకరించారు.

లోక్‌సభ ఎన్నికల్లోనూ

ఇవే ఫలితాలు

తుమకూరు: రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ ఘడ్‌ ఫలితాలు లోక్‌సభ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని మాజీ మంత్రి ఎం.పీ.రేణుకాచార్య అన్నారు. సోమవారం తమకూరు నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రధాని మోదీ హ్యాట్రిక్‌ సాధిస్తారన్నారు.

శబరిమలకు ప్రత్యేక రైలు

హుబ్లీ: హుబ్లీ నుంచి శబరిమలకు ప్రత్యేక రైలు సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం శనివారం అయ్యప్పస్వామి మాలధారులు హుబ్లీ స్టేషన్‌లో హుబ్లీ–కొట్టాయం–హుబ్లీ రైలు (07305/ 07306)కు ప్రత్యేక పూజలు చేశారు. బోగీలను అరటి గెలలు, పూలతో అలంకరించారు.

Advertisement

What’s your opinion

Advertisement