Sakshi News home page

ఎన్నిక‌ల‌కు 2 రోజుల ముందు నుంచే బల్క్‌ మెసేజ్‌లు బంద్‌! : రాజర్షిషా

Published Tue, Nov 28 2023 7:00 AM

- - Sakshi

సాక్షి, మెదక్‌: ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌ తేదీకి 72 గంటల ముందు స్టాండింగ్‌ అవర్‌, 48 గంటల నుంచి నిశ్శబ్ద వ్యవధి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా తెలిపారు. సోమవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 28 సాయంత్రం 5 నుంచి పోలింగ్‌ ముగిసే వరకు నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని, కాబట్టి రెండు రోజుల ముందే పత్రికా ప్రకటనలకు అనుమతులు పొందాలని సూచించారు.

అలాగే లోకల్‌ ఛానళ్లతో పాటు శాటిౖ లెట్‌ ఛానళ్లలో కూడా ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయకూడ దని ఆదేశించారు. 28 నుంచి 30 సాయంత్రం 5 గంటల వరకు బల్క్‌ మెసేజ్‌లను నిషేధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా బల్క్‌ మెసేజ్‌లు పంపితే 73373 40816కు ఫోన్‌, లేదా వాట్సప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలి..
30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల విధులకు వచ్చే సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలని రాజర్షిషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌, మెదక్‌ నియోజకవర్గాలకు చెందిన ఆర్‌ఓలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ సెంటర్‌లో సౌక ర్యాలు కల్పించాలని, పోలింగ్‌ సామగ్రి సరఫరా, పోలింగ్‌ సిబ్బందికి సౌకర్యాలు, భోజనాలు , వెబ్‌కాస్టింగ్‌, సీసీ కెమెరా, వీడియో రికార్డ్‌, సెక్యూరిటీ లాంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

పకడ్బందీగా ఏర్పాట్లు!
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాజర్షిషా ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డులు, ఓటరు స్లిప్పుల పంపిణీ, ఈవీఎంల తరలింపు, కౌంటింగ్‌ ఏర్పాట్లపై సూచనలు చేశారు. అనంతరం రాజర్షిషా మాట్లాడుతూ పోలింగ్‌కు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇవి చదవండి: ప్రతి ఏడాదీ జాబ్‌ క్యాలెండర్‌! : హరీశ్‌రావు

Advertisement

What’s your opinion

Advertisement