Bigg Boss Rathika: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. ఆమెపై వచ్చిన పుకార్లకు క్లారిటీ

2 Oct, 2023 10:17 IST|Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-7 టైటిల్ ఫేవరెట్‌గా రతిక రోజ్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఆమె అమాయికత్వంతో పాటు కొన్ని లక్షల మంది చూస్తున్న జడ్జిమెంట్‌ ప్రొగ్రామ్‌లో ఎలా ముందుకు వెళ్లాలో పసిగట్టలేకపోయింది. కొన్నిసార్లు తిక్కల వాదనలున్నా సరే రతిక కాస్త నయం. షోలో ఆమె ఇండివిడ్యుయాలిటీని చూపించింది. ఆటలో ఆమెకు నచ్చింది చేసింది.

మరోక కంటెస్టెంట్‌ ఇచ్చిన సలహాను ఎక్కడా పాటించకుండా తన ఆటను కొనసాగించింది. ఆమె మొదట చేసిన అతిపెద్ద తప్పు రైతుబిడ్డ అని చెప్పుకుంటున్న పల్లవి ప్రశాంత్‌తో జతకట్టడం.. ఆ తర్వాత అతనితో విబేదాలు రావడం ఆమెకు మైనస్‌ అయింది. రైతుబిడ్డ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రశాంత్‌ ఎంట్రీ ఇవ్వడంతో అతనికి చాలామంది ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యారు. తను కూడా శక్తికి మించి బిగ్‌బాస్‌లో పోరాడుతున్నాడు.

రతిక ఊరు ఎక్కడ
తాజాగా రతిక తల్లిదండ్రులు పలు ఆస్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ.. తమ గతాన్ని గుర్తుచేసుకుని బోరున ఏడ్చారు. ఆమె పక్కా రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇప్పటికీ ఆమె తండ్రి రాములు వ్యవసాయం చేస్తున్నాడు. రతిక అసలు పేరు ప్రియ అని తాము తెలంగాణలోని తాండూర్‌కు చెందిన వారమని ఆయన తెలిపాడు. కానీ ప్రస్తుతం ఆమె కోరికమేరకు హైదరాబాద్‌లో ఉంటున్నామని చెప్పాడు. రతిక వల్ల ఈ రోజు తమ జీవితం ఆనందంగా కొనసాగుతుందని రాములు తెలిపాడు. ఒకప్పుడు కనీసం రతిక స్కూల్‌ ఫీజులు కూడా కట్టలేని స్థితిలో ఉండగా తనకు నవోదయ పాఠశాల్లో సీటు రావడంతో ఆమెను చదివించగలిగాను అని చెబుతూ ఆమె తండ్రి రాములు కన్నీళ్లు పెట్టుకున్నాడు.

గ్రామ సర్పంచ్‌గా నిజాయితీగా పనిచేశా
గ్రామ సర్పంచిగా పనిచేసినప్పటికీ నిజాయితీగానే ఉన్నానని, బిడ్డల కోసం సంపాదించింది ఏమీలేదని ఆయన చెప్పాడు. ఆమె చదవులో మెరిట్‌ ఉండటంతో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఉచితంగా ఆయన కాలేజీలో ఇంజనీరింగ్‌ చదివించాడని ఆయన పేర్కొన్నాడు. ఆమెది చిన్నపిల్ల మనస్థత్వం అని,  అంతే తప్ప కావాలని  ఎవరినీ ఇబ్బంది పెట్టదని తెలిపాడు. తమ ఇంట్లో ఎలా ఉంటుందో బిగ్‌బాస్‌లో కూడా అలాగే ఉందని ఇలా రాములు తెలిపాడు. 

రతిక ప్రేమ,పెళ్లిపై వ్యాఖ్యలు
'నాకు మగపిల్లలు లేరు.. ఇద్దరూ ఆడపిల్లలే.. రతిక రెండో పాప, మొదటి అమ్మాయికి ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది. రతికనే కష్టపడి ఒక మగపిల్లాడిలా మమ్మల్ని పోషిస్తుంది. గతంలో ఎన్నో కష్టాలు పడ్డాము.. రతిక మా కుటుంబానికి కొడుకులా నిలబడింది. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మొదట మా పాపకు 'తుపాకి రాముడు' సినిమాతో జీవితం ఇచ్చారు. తర్వాత ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి. ఆమెపై కావాలనే కొందరు ప్రేమ పేరుతో పుకార్లు క్రియేట్‌ చేస్తున్నారు. ఆమె ఎవరినీ ప్రేమించలేదు. తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు ఒక తండ్రిగా నేను చేస్తా.. ఏదున్నా ఓపెన్‌గా ఇంట్లో చెప్తుంది. ఆమెకు నచ్చినట్లు పెళ్లి చేయడం నా భాద్యత' అని రాములు తెలిపాడు

రతిక గురించి ఆమె తల్లి మాటల్లో..
తన కూతురు రతిక ఒక తల్లిగా తమ కుటుంబాన్ని చూసుకుంటుంది. ఆమె వల్లే తాము హైదరాబాద్‌కు వచ్చామని రతిక తల్లి అనిత ఇలా చెప్పింది. 'కుటుంబం కోసం మొదట్లో నేను ప్రైవేట్‌ హస్పిటల్‌లో పనిచేశాను.. తక్కువ జీతానికి అంతదూరం వెళ్లి కష్టపడటం ఎందుకు అని రతిక వారించడంతో ఉద్యోగం మానేశాను. మిమ్మల్ని పోషించడం కూతురిగా నా బాధ్యత అని హైదరాబాద్‌లో ఒక ఇల్లు రతికనే కొన్నది. ప్రస్తుతం ఆమె సంపాదనతోనే తాము ఉంటున్నట్లు రతిక తల్లిదండ్రులు తెలిపారు. కానీ తనకు పొలంలో పనిచేయడం ఇష్టం కాబట్టి వారంలో మూడు రోజులు తమ గ్రామం అయిన తాండూర్‌కు వెళ్తానని రాములు చెప్పాడు. తమకు ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపాడు.

శివాజీ,తేజ,యావర్‌ కంటే తక్కువా..
హౌస్‌ నుంచి ముందుగా శివాజీని పంపించేయాలని ఇప్పటికే కొందరు భారీగా కామెంట్లు చేస్తున్నారు. ఆయన నుంచి కనీసం వీసమెత్తు ఎంటర్‌టెయిన్‌మెంట్ కూడా చేయడం చేతకావడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఆయన నుంచి పెత్తందారీ పోకడ భరించలేక కంటెస్టర్లు కూడా శివాజీ బయాస్డ్‌గా ఉన్నారని ముద్రవేశారు . ఇది గ్రహించే తన అస్త్రను పగులగొట్టి, డిమోషన్ ఇచ్చేశాడు బిగ్‌బాస్‌. మరోవైపు యాంగర్‌ యావర్, తేజలు సరేసరి.. ఏ మాత్రం ఎంటర్‌టైన్‌ చేయడంలేదని కామెంట్లు వస్తున్నాయి.

ఇప్పటికే మహిళా కంటెస్టెంట్లను అందరినీ బిగ్‌బాస్‌ నుంచి వరుసగా బయటికి వచ్చేశారు. షకీలాతో మొదలుపెడితే..  కిరణ్ రాథోడ్, సింగర్ దామినిని పంపించేశాడు బిగ్‌బాస్‌. రతిక రోజ్‌ను మాత్రం పనికట్టుకుని ఒక వర్గం ఆడియన్సే పంపించారని టాక్‌ నడుస్తుంది. ఇలా మహిళలను అందరినీ హౌస్‌ నుంచి బిగ్‌బాస్‌ పంపించిడంతో వైల్డ్‌ కార్డు ఎంట్రీకి సమయం ఆసన్నమైందని ప్రచారం జరుగుతుంది.

మరిన్ని వార్తలు