Bigg Boss Telugu 7 Promo Released: Nagarjuna Akkineni Dialogue In Promo Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu Latest Promo: బిగ్‌బాస్‌-7 ప్రోమోతో వచ్చేసిన నాగార్జున

Published Wed, Jul 19 2023 6:58 AM

Bigg Boss Telugu 7 Promo Released Nagarjuna Akkineni - Sakshi

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్‌లు పూర్తికాగా, త్వరలోనే బిగ్‌బాస్‌-7 ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన టైటిల్‌ గ్లింప్స్‌ను మేకర్స్‌ ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా బిగ్‌బాస్‌ -7 ప్రోమోను 'స్టార్‌ మా' విడుదల చేసింది. ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇలా  అభిమానులకు  బిగ్‌బాస్‌ టీమ్‌​ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది.  ఓటీటీ వేదికైన  డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ ఈ కార్యక్రమం స్ట్రీమింగ్‌ కానుందని వెల్లడించారు.  

(ఇదీ చదవండి: హీరోయిన్‌​ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' గురించి తెలుసా..?)

సీజన్‌ 1లో ఎన్టీఆర్‌, సీజన్‌ 2లో నాని హోస్ట్‌గా సందడి చేసిన సంగతి తెలిసిందే. తర్వాత వచ్చిన అన్ని సీజన్ల వరకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా మెప్పంచిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా 7వ సీజన్లో నాగ్‌నే హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చేశారు. ఈ ప్రోమోలో నాగ్‌ లుక్‌ అదిరిపోయింది. ఆగష్టు చివరి వారంలో బిగ్‌ బాస్‌-7 జర్నీ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

(ఇదీ చదవండి: 50 దాటేసిన వరలక్ష్మి ... అప్పట్లో ఈ బ్లాక్‌ బస్టర్‌ సినిమా చేసుంటేనా?)

ఈసారి షో చాలా కొత్తగా ఉంటుందని  ఈ ప్రోమోలో నాగార్జున చెప్పారు... ప్రతిసారి ఇదే డైలాగ్‌ కదా చెప్పేది అని. మరో డైలాగ్‌ అందుకుంటాడు.  'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌' అంటూ ప్రోమోతో నాగ్‌ ముందుకు వచ్చాడు. ఈ డైలాగ్‌తో కంటెస్టెంట్‌లను కొంతమేరకు డైలామాలో పడేశాడు. అంటే ఈసారి షో రొటిన్‌గా కాకుండా రూట్‌ మార్చాలనే ప్లాన్‌లో ఉన్నట్లు అర్థం అవుతుంది. గత ఆరు సీజన్ల మాదిరి అవే టాస్క్‌లు కాకుండా కొంచెం కొత్తగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు ఆడియన్స్‌ ఊహకు కూడా అందకుండా షో రన్‌ చేయాలిని నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement