Bigg Boss 7 Shakeela: గర్భం దాల్చాను.. అమ్మ అబార్షన్‌ చేయించింది.. ప్రియుడితో ఇప్పటికీ టచ్‌లో..

16 Sep, 2023 10:45 IST|Sakshi

బోల్డ్‌, అడల్ట్‌ కంటెంట్‌ సినిమాలతో ప్రేక్షకులకు సుపరిచితమైంది షకీలా. సౌత్‌లో దాదాపు అన్ని భాషల్లో నటించిన ఈమె రియల్‌ లైఫ్‌లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఒకానొక సమయంలో ఒకరిని ప్రేమించి గర్భం దాల్చగా చివరకు అబార్షన్‌ చేయించుకుంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌ తెలుగు 7 సీజన్‌లో పాల్గొన్న ఆమె ఈ షోకి వెళ్లడానికి ముందు ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

చిన్నవయసులోనే ప్రెగ్నెన్సీ
షకీలా మాట్లాడుతూ.. 'నేను గతంలో ఒక వ్యక్తిని ప్రేమించాను. నా బాయ్‌ఫ్రెండ్‌ వల్ల నేను గర్భం కూడా దాల్చాను. కానీ అప్పుడు నాది చిన్నవయసు కావడంతో అబార్షన్‌ చేయించుకున్నాను. మా అమ్మకు నేను అప్పుడే పిల్లల్ని కనడం ఇష్టం లేదు కూడా! అందుకే తీసేయించుకున్నాను. నేను చేసింది సరైనదే అని నా అభిప్రాయం. నిజానికి నేను ప్రెగ్నెంట్‌ అన్న విషయం కూడా ఆలస్యంగా తెలిసింది. ఎందుకంటే నాకు పీరియడ్స్‌ క్రమం తప్పకుండా వచ్చేవి కావు. కొన్నిసార్లు ఆలస్యమయ్యేవి.

లోపాలు రావచ్చు, అందుకనే..
అందుకే లైట్‌ తీసుకున్నాను. కానీ మా అమ్మ మాత్రం నా పొట్టను అదే పనిగా గమనించింది. ఏమైందని అడిగితే ఏం లేదని చెప్పి నన్ను డాక్టర్‌ దగ్గరకు తీసుకువెళ్లి అబార్షన్‌ చేయించింది. నేను పిల్లల్ని కనేందుకు అది సరైన సమయం కాదని తను భావించింది. ఒకవేళ కాదని నేను ఆ గర్భాన్ని అలాగే ఉంచుకుంటే పుట్టబోయే బిడ్డలో లోపాలు ఉండవచ్చు. అందుకే అబార్షన్‌ చేయించుకుని మంచి పనే చేశాను. అప్పుడు ప్రేమించి వ్యక్తితో నేనిప్పటికీ టచ్‌లో ఉన్నాను' అని చెప్పుకొచ్చింది.

అప్పటి నుంచి అమ్మగా
కాగా తొలినాళ్లలో గ్లామర్‌ పాత్రలు చేసిన షకీలా తర్వాతి కాలంలో ఆ ఇమేజ్‌ను చెరిపేసుకునేందుకు ప్రయత్నించింది. కుక్‌ విత్‌ కోమలి రెండో సీజన్‌లో పాల్గొంది. తనలోని పాకశాస్త్ర నైపుణ్యాన్ని వెలికి తీసింది. అంతేకాకుండా తన ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నం చేసింది. ఈ షోలో పాల్గొన్నప్పటి నుంచి షకీలా కాస్త షకీలా అమ్మగా మారింది. కన్నడ బిగ్‌బాస్‌ 2లోనూ పాల్గొన్న ఈమె ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్‌ షో 7లో ఉంది.

చదవండి: రాజకీయ ఎంట్రీకి అంతా ముందే సిద్ధం చేసుకుంటున్న దళపతి!

మరిన్ని వార్తలు