నిర్మాత కావాలన్నదే లక్ష్యం 

8 Sep, 2023 01:15 IST|Sakshi
నవీన్‌ 

‘‘కృష్ణ, చిరంజీవిగార్ల సినిమాలు చూసి హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీగార్ల స్ఫూర్తితో హాస్య నటుడిగా నాకంటూ గుర్తింపు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. నిర్మాత కావాలన్నదే నా లక్ష్యం.. అలాగే ఒక సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌ నిర్మించాలన్నది నా కల’’ అని నటుడు గడ్డం నవీన్‌ అన్నారు.

రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’, వెంకటేష్‌ ‘సైంధవ్‌’ చిత్రాలతో పాటు ‘భైరవ కోన’, ‘మిస్టరీ, ‘వృషభ’, ‘చూ మంతర్‌’, ‘భూతద్దం భాస్కర్‌’ వంటి పలు సినిమాల్లో నటిస్తున్న ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ 150 సినిమాలు చేస్తే, వాటిలో 90 చిత్రాల్లో మంచి పాత్రలొచ్చాయి. ఈ ఏడాది సంతృప్తికరమైన ప్రయాణం సాగుతోంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు