ముగ్గురు టాప్‌ యాంకర్లతో హీరో ప్రదీప్‌ స్టెప్పులు

27 Jan, 2021 15:22 IST|Sakshi

30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనేది థియేటర్ల సాక్షిగా అభిమానులకు నేర్పించబోతున్నాడు యాంకర్‌ ప్రదీప్‌. ఆయన హీరోగా, అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం "30 రోజుల్లో ప్రేమించడం ఎలా?". ఫణి ప్రదీప్‌ (మున్నా) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్‌. రిపబ్లిక్‌ డే సందర్భంగా మంగళవారం 'వావా మేరే బావా' అనే ప్రమోషనల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేసింది. (చదవండి: సింగర్‌ సునీత వెడ్డింగ్‌.. సుమ డాన్స్‌ అదరహో)

ఇందులో పోర్ల జోలికి వెళ్లొద్దంటూనే ప్రదీప్‌ ముద్దుగా ముద్దుగుమ్మలతో డ్యాన్స్‌ చేయడం విశేషం. ఆ ముగ్గురు భామలెవరో కాదు, తెలుగు బుల్లితెరను ఏలుతున్న ముగ్గురు టాప్‌ యాంకర్లు రష్మీ, అనసూయ, శ్రీముఖి. ఇంకేముందీ.. యాంకర్లందరూ ఒకేచోట చేరి స్టెప్పులేస్తే ఆ జోష్‌ ఎలా ఉంటుందో చూపించాడు ప్రదీప్‌. ప్రస్తుతం ఈ వావా మేరే బావా పాట నెట్టింట వైరల్‌గా మారింది. ఆ సాంగ్‌ను మీరు కూడా మరోసారి వినేయండి. (చదవండి:  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జాబ్ వచ్చిందని ఏడ్చాను: ప్రదీప్‌)

30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు