అభిమాని అలాంటి ప్రశ్న అడగడంతో ఫైర్‌ అయిన తమన్నా..

14 Oct, 2023 06:44 IST|Sakshi

నటి తమన్నా రూటే సెపరేటు. పాలరాతి బొమ్మలాంటి అందాలు ఈమెకే సొంతం. మొదటినుంచి గ్లామర్‌ పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ వచ్చిన తమన్నా అలాంటి పాత్రలపైనే తన నట జీవిత సౌధాలను ఏర్పాటు చేసుకుంది అని చెప్పవచ్చు. తాజాగా సమీప కాలంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన జైలర్‌ చిత్రంలో ఒక్క పాటకి, ఒకటి రెండు సన్నివేశాలకే పరిమితమైంది. అయినా ఆ చిత్ర ప్రమోషన్‌ అంతా ఆమె పాటపైనే సాగిందని చెప్పవచ్చు. అందులో నువ్వు కావాలయ్యా అనే పాటలో తమన్న డాన్స్‌ యువతను గిలిగింతలు పెట్టింది.

(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి)

అయితే ఆ పాటలో తమన్నా హద్దులు మీరి అందాలను ఆరబోసిందని విమర్శలను ఎదుర్కొంటుంది. ఇదే ప్రశ్నను ఇటీవల ఒక అభిమాని తమన్నాను అడగ్గా ఆమె అతనిపై ఫైర్‌ అయ్యింది. అవకాశాలు తగ్గడంతో ఆ విధంగా అందాలను విచ్చలవిడిగా తెరపై ఆరబోస్తున్నారా అన్న ఆ అభిమాని ప్రశ్నకు తమన్నా బదులిస్తూ తనకు అవకాశాలు లేవని ఎవరు చెప్పారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఇప్పటికీ రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని చెప్పింది. అంత బిజీగా ఇంతకుముందు ఎప్పుడులేనని కూడా పేర్కొంది.

అయినా తన హద్దులు ఏమిటన్నది తనకు తెలుసని తాను ధరించే దుస్తులు ఆయా పాత్రలకు తగ్గట్టుగా ఉంటాయని చెప్పింది. తాను పాత్రలు నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తానని, అలా ఒప్పుకున్న తర్వాత ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉంటుందని పేర్కొంది. అరకొర తెలివితో ఇలాంటి ప్రశ్నలు వేయవద్దని హెచ్చరించింది. పెళ్లి ఎప్పుడు అన్న మరో అభిమాని ప్రశ్నకు తనకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందో అప్పుడు చేసుకుంటానని తమన్నా బదులిచ్చింది.

(ఇదీ చదవండి: దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. దొంగలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్‌)

మరిన్ని వార్తలు