Sakshi News home page

ముదిరాజ్‌ల ఓట్లు అడిగితే నిలదీయాలి

Published Sat, Nov 11 2023 1:36 AM

-

ఏటూరునాగారం: కులాల పేరు చెప్పి ఓట్లు అడిగే వారిని నిలదీయాలని ములుగు నియోజకవర్గ ముదిరాజ్‌ మహాసభ ఇన్‌చార్జ్‌ చిటమట రఘు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ముదిరాజ్‌ మహాసభ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణలో ఒక్క ముదిరాజ్‌ అభ్యర్థిగా ఎమ్మెల్యే బీఫామ్‌ ఇవ్వలేదన్నారు. సర్పంచ్‌, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు గుర్తుకు రాని ముదిరాజ్‌లు ఇప్పుడు గుర్తుకు వస్తున్నారా అని ప్రశ్నించారు. ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్‌, పల్లెబోయిన అశోక్‌ నాయకత్వం ఆధ్వర్యంలో ములుగు జిల్లా ముదిరాజ్‌ మహాసభ కుటుంబ సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడిగా బొల్లు దేవేందర్‌ను రెండు సంవత్సరాల క్రితం నియమించారన్నారు. అయితే ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల వద్ద ముదిరాజ్‌ల ఆత్మగౌరవాన్ని కోళ్ల వెంకన్న తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఆయన ముదిరాజ్‌ల సమస్యలపై ప్రభుత్వాన్ని కోరిన దాఖలాలు లేవన్నారు. వెంకన్న మాటలు ముదిరాజ్‌లు నమ్మొద్దని కోరారు.

Advertisement

What’s your opinion

Advertisement