Sakshi News home page

విశేష స్పందన వచ్చింది

Published Sat, Nov 18 2023 1:52 AM

- - Sakshi

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. ప్రతిచోటా వైద్యశిబిరాలకు విశేష స్పందన లభించింది. ప్రతి వైద్యశిబిరానికి సగటున 400 మంది దాకా చికిత్స కోసం వచ్చారు. ఈ కార్యక్రమం ఎంతో వినూత్నమైనది. సదుద్దేశంతో రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగింది. జబ్బులకు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఊళ్లోకే వైద్యులు రావడంతో వైద్యం చేయించుకోవడం ప్రజలకు సులభమైంది.

–డాక్టర్‌ రామగిడ్డయ్య, డీఎంహెచ్‌వో, కర్నూలు

ప్రత్యేక చికిత్స అందించాం

జగనన్న ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాల్లో అక్కడి వైద్యులు రెఫర్‌ చేసిన వారికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రత్యేకంగా చికిత్స చేయించాం. మొత్తం 2,181 మందికి రెఫర్‌ చేయడంతో ప్రతిరోజూ కొద్ది మంది చికిత్స కోసం వస్తున్నారు. వారికి పేయింగ్‌ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓపీ ద్వారా స్పెషలిస్టు వైద్యులచే చికిత్స చేయిస్తున్నాం. అవసరమైన వారిని ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స చేయించాం. బీపీ, షుగర్‌ జబ్బులు బయటపడ్డ వారికి ఇక్కడ మరిన్ని వైద్యపరీక్షలు చేయించి వైద్యులచే సూచనలు, సలహాలు అందించాం.

–డాక్టర్‌ ఎం. భాస్కరరెడ్డి, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌, కర్నూలు

Advertisement

What’s your opinion

Advertisement