Sakshi News home page

రైల్వేలో ఖాళీల సంఖ్య 2.74 లక్షలు

Published Thu, Jun 29 2023 6:25 AM

2. 74 lakh posts vacant in Railways - Sakshi

న్యూఢిల్లీ: రైల్వేలో 2.74 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. ఇందులో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఖాళీలే 1.75 లక్షల వరకు ఉన్నాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌ సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద అడిగిన ప్రశ్నలకు రైల్వే శాఖ వివరంగా సమాధానమిచి్చంది. రైల్వే శాఖలో మొత్తంగా 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసింది.

ఇందులో భద్రత కేటగిరీకి సంబంధించిన ఖాళీలు 1,77,924గా ఉన్నాయి. జూన్‌ 1 తేదీ నాటికి నాన్‌ గెజిటెడ్‌ గ్రూప్‌ సిలో 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు రైల్వే శాఖ చెప్పింది. ఇక రైల్వేల భద్రతకు సంబంధించి 9.82 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే 8.04 లక్షల భర్తీ చేసినట్టు వివరించింది. భద్రత కేటగిరీలో లోకో పైలెట్లు, ట్రాక్‌ తనిఖీలు చేసే వ్యక్తులు, పాయింట్స్‌మెన్, ఎలక్ట్రీషియన్లు, ఇంజనీర్లు, సిగ్నల్‌ అసిస్టెంట్లు, ఇంజనీర్లు, ట్రైన్‌ మేనేజర్లు, స్టేషన్‌ మాస్టర్లు, టికెట్‌ కలెక్టర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. ఒడిశాలో బాలాసోర్‌ వద్ద ఘోరమైన రైలు ప్రమాదం నేపథ్యంలో ఆర్‌టీఐ కింద పోస్టుల ఖాళీలపై ఆర్‌టీఐ కింద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

Advertisement

What’s your opinion

Advertisement