Sakshi News home page

ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు ఊహించని ఫలితం!

Published Tue, Dec 5 2023 8:04 AM

BJP Candidates Ishwar Sahu Defeted Congress Minister Ravindra Choubey - Sakshi

ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈసారి 90 స్థానాలకు గాను 54 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ 35 సీట్లకే పరిమితమయ్యింది. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్ ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సాజా స్థానం నుంచి ఏడు సార్లు కాంగ్రెస్ తరపున పోటీ చేసి, ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి రవీంద్ర చౌబేపై బీజేపీ అభ్యర్థి ఈశ్వర్ సాహు విజయం సాధించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతర జిల్లా సాజా అసెంబ్లీ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలో ఈశ్వర్‌ సాహు కుమారుడు మృతి చెందాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈశ్వర్‌ సాహుకు బీజేపీ టికెట్‌ ఇచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి రవీంద్ర చౌబేని కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దింపింది. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా  ఎన్నికయ్యారు. ఈశ్వర్ సాహు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. తన కుమారుడి మృతితో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పినా ఈశ్వర్ సాహు ఆ సాయం తీసుకోలేదు.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు భువనేశ్వర్ సాహును బీరాన్‌పూర్, బెమెతారాలో జిహాదీల వర్గం హత్య చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు. ఈ నేపధ్యంలో అతని తండ్రి ఈశ్వర్ సాహుకు ‘సాజా’ స్థానం నుండి పోటీ చేసేందుకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: పొత్తు లేకనే కాంగ్రెస్‌ చిత్తు?.. ఇండియా అలయన్స్ నేతలు ఏమంటున్నారు? 

Advertisement

What’s your opinion

Advertisement